News October 27, 2025

నగరంలో ఉ‘సిరి’కి భారీ డిమాండ్

image

నగరంలో చాలా ప్రాంతంలో ఉసిరికాయలకు చాలా డిమాండ్ పెరిగింది. కార్తీకమాసం ప్రారంభం అవడంతో కొనుగోళ్లు పెరిగాయి. దేవాలయాల్లో విష్ణువు, శివుడి వద్ద ఉసిరి దీపాలు వెలిగించడానికి మహిళలు, యువతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వనస్థలిపురం రైతుబజారులో 250గ్రా. ఉసిరి రూ.30- ₹50 అమ్ముతున్నారు. కాయ, ఆకులు గల ఉసిరి కొమ్మను రూ.50- ₹80 వరకు విక్రయిస్తున్నారు. ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.

Similar News

News October 27, 2025

ధర్మపురి: మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అరెస్ట్..!

image

సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్‌ను స్వీకరించిన మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న ఆయణ్ను అరెస్ట్ చేసిన పోలీసులు సైఫాబాద్ పోలిస్ స్టేషన్‌కు తరలించారు.

News October 27, 2025

‘డిజిటల్ అరెస్టుల’పై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు

image

దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. వీటిపై నమోదైన FIRలను సమర్పించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుల విచారణ బాధ్యతను CBIకి అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకోసం సైబర్ క్రైమ్ నిపుణులు, వసతులు కావాలంటే చెప్పాలని CBIకి సూచించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

News October 27, 2025

ప్రజలందరూ ఇంటికే పరిమితం అవ్వండి: SP

image

ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. బలమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అనవసర ప్రయాణాలు పూర్తిగా మానుకోవాలని తెలిపారు. వాగులు, వంకలు, చెరువులు, కుంటలలో స్నానాలకు దిగవద్దని హెచ్చరించారు. ఇల్లు శిథిలావస్థలో ఉంటే బంధువుల ఇళ్లకు వెళ్లాలని సూచించారు.