News December 7, 2025

నగరంలో NAVY బ్యాండ్ షో.. ఫ్రీ ఎంట్రీ

image

ఇండియన్ నేవీ డే ఉత్సవాల్లో భాగంగా NAVY సాగర శక్తిని చాటిచెప్పే సంగీత విభావరి హైదరాబాద్‌లో జరగనుంది. తూర్పు నౌకాదళ కమాండ్ (విశాఖపట్నం) నుంచి వచ్చిన 26 మంది సభ్యుల నేవీ బ్యాండ్, డిసెంబర్ 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు కొండాపూర్‌లోని సరత్ సిటీ మాల్‌లో ఒక గంట పాటు సంగీత ప్రదర్శన ఇవ్వనుంది. 1971 యుద్ధ విజయ స్ఫూర్తిని గుర్తుచేస్తారు. ఈ ఉచిత కార్యక్రమానికి ప్రజలందరూ ఆహ్వానితులే.

Similar News

News April 5, 2026

8న చెరువుగట్టు ఆలయ టెండర్ల వేలం

image

చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో 2026-27 సంవత్సరానికి సంబంధించిన వివిధ టెండర్ల బహిరంగ వేలం ఈనెల 8న (బుధవారం) జరగనుంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు గట్టుపై ఉన్న ఈవో కార్యాలయం వద్ద వేలం నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 8 వరకు వర్తించే ఈ వేలం ప్రక్రియలో ఆసక్తి గలవారు పాల్గొనాలని ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

News April 5, 2026

నల్గొండ: మందులేదు.. టీకానే శ్రీరామరక్ష!

image

పశువులకు సోకే గాలికుంటు అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి. వైరస్ వల్ల వచ్చే ఈ రోగానికి ప్రత్యేకమైన మందు లేదు. వ్యాధి సోకితే కేవలం లక్షణాలను బట్టి గాయాలు కడగడం, యాంటీ బయాటిక్స్ వాడటం, మెత్తటి మేత పెట్టడం మాత్రమే చేయగలం. దీంతో పశువులు తీవ్రంగా ఇబ్బంది పడతాయి. అందుకే ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న గాలికుంటు నిరోధక టీకాలను రైతులు తమ పశువులకు తప్పనిసరిగా వేయించి కాపాడుకోవాలి.

News April 5, 2026

ADB: ఈ స్ఫూర్తితో ఎర్రజెండా రెపరెపలాడేనా..?

image

క్యాతన్‌పల్లి మున్సిపల్ పీఠాన్ని BRS-CPI కూటమి కైవసం చేసుకోవడం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపింది. జిల్లాలో గట్టి పట్టున్న కమ్యూనిస్టు పార్టీలు ఈ గెలుపుతో కేడర్‌లో నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి. ముఖ్యంగా సింగరేణి బెల్ట్ ఏరియాలో ఈ విజయం ‘ఎర్రజెండా’ పూర్వవైభవానికి నాంది పలుకుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలకు సుమారు 50వేల ఓట్లు ఉంటాయి.