News December 23, 2025

నగరిలో టీడీపీ నేత అక్రమాలు: YCP

image

నగరి ఎమ్మెల్యే అండతో టీడీపీ నేత భారీగా రేషన్ అక్రమ రవాణా చేశారని వైసీపీ ఆరోపించింది. నిండ్రలోని నెట్టేరి వద్ద తనిఖీల్లో 4 టన్నుల రేషన్ బియ్యంతో టీడీపీ ఎస్సీ సెల్ నేత అల్లిముత్తు పట్టుబడినట్లు తెలిపింది. తర్జనభర్జనల తర్వాత అల్లిముత్తు , కార్తీక్‌ , విక్రమ్‌‌పై పోలీసులు కేసు నమోదు చేశారని, సీజ్ ద షిప్ అనే పవన్ కళ్యాణ్ ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించింది.

Similar News

News December 29, 2025

తిరుమల: 365 రోజులు.. 450 ఉత్సవాలు

image

ఏడాదికి 365 రోజులే. కానీ కోరిన కోర్కెలు తీర్చే తిరుమల కోనేటి రాయుడికి ఏడాదిలో 450పైగా ఉత్సవాలు జరుగుతాయి. సుప్రభాతం, తోమాల, సహస్రనామార్చన, అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, పూలంగి, శుక్రవారాభిషేకం, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, శ్రవణం నక్షత్రోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, పద్మావతి పరిణయం తదితర ఉత్సవాలు చేస్తారు. ఇలా రోజూ ఒక పండగగా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా తిరుమల విరాజిల్లుతోంది.

News December 29, 2025

26 మండలాలకు తగ్గనున్న చిత్తూరు జిల్లా

image

కొత్త చిత్తూరు జిల్లా 32 నుంచి 26 మండలాలకు పరిమితం కానుంది. <<18703423>>పుంగనూరు<<>> నియోజకవర్గం(6 మండలాలు)ను అన్నమయ్య జిల్లాలో కలుపుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య సైతం 7 నుంచి 6కు చేరుకుంది.

News December 29, 2025

OFFICIAL: చిత్తూరు నుంచి పుంగనూరు ఔట్

image

చిత్తూరు జిల్లా నుంచి పుంగనూరు నియోజకవర్గాన్ని వేరు చేయడం అధికారికంగా ఖరారైంది. మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి, పుంగనూరుతో అన్నమయ్య జిల్లాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె ఉంటుంది. మరోవైపు బంగారుపాళ్యాన్ని పలమనేరు డివిజన్‌ నుంచి చిత్తూరులో కలిపారు. తిరుపతి జిల్లాలో రైల్వే కోడూరు విలీనానికి గ్రీన్ సిగ్నల్ చ్చారు. జనవరి 1 నుంచి మార్పులు అమలులోకి రానున్నాయి.