News December 14, 2024

నగరి: విద్యుత్ సిబ్బంది సాహసం.. బోటులో వెళ్లి మరమ్మతులు

image

రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గూళూరు చెరువు పూర్తిగా నీటితో నిండింది. దీంతో వడమాల పేట మండలంలో శుక్రవారం విద్యుత్ సరఫరా ఆగిపోయింది. విద్యుత్ సిబ్బంది నిండుకుండలా మారిన గూళూరు చెరువులోకి బోటులో వెళ్లి లైన్‌కు మరమ్మతులు చేపట్టారు. ప్రాణాలకు తెగించి వారు చూపిన తెగువను పలువురు అభినందించారు. 

Similar News

News December 15, 2025

చిత్తూరు జిల్లాలో ఘోరం..!

image

చిత్తూరు మండలం తుమ్మిందకు చెందిన బాబు ప్రైవేట్ స్కూల్ వ్యాన్ డ్రైవర్. అతని భార్య కవిత ఆ బస్సులోనే హెల్పర్‌గా పనిచేస్తున్నారు. కవితకు ఇటీవల రూపేశ్ అనే వ్యక్తి పరిచయం కావడంతో బంగారు నగలు ఇచ్చింది. వాటిని అతను తిరిగి ఇవ్వలేనని చెప్పాడు. నగల విషయమై శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన కవిత తన కుమారుడు ముఖేష్(4)తో కలిసి గ్రామ సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

News December 14, 2025

కుప్పం: పేలిన నాటు బాంబు.. పరిస్థితి విషమం

image

కుప్పం (M) కొట్టాలూరు పంచాయతీ ఎర్రమన్ను గుంతలు సమీపంలో నాటు బాంబు పేలి చిన్న చిన్న తంబి (38) తీవ్రంగా గాయపడ్డాడు. చిన్న తంబి శరీరం ఓవైపు పూర్తిగా కాలిపోవడంతో అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం కుప్పం PES ఆసుపత్రికి తరలించారు. చిన్న తంబి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై కుప్పం పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 14, 2025

చిత్తూరులో పెంపుడు కుక్కకు సమాధి

image

తమ కుటుంబంలో ఒకరిలా గారాబంగా పెంచుకున్నారు. వారితో పాటే అన్నం పెట్టారు. స్నానం చేయించారు. వారి మధ్యే నిద్ర కూడా పోనిచ్చేవారు. చివరికి తమని వదిలి వెళ్లిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోయారు. ఇంతకీ ఎవరిని అనుకుంటున్నారా! చిత్తూరు పట్టణంలోని గ్రీమ్స్ పేటలో ఓ పెంపుడు కుక్క స్టోరీ ఇది. అది చనిపోవడంతో దానిని మర్చిపోలేక సమాధి కట్టించాడు యజమాని. ఈ వింతను చూసేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు.