News June 18, 2024

నగరి: శాలువాలు, పూలబొకేలు తీసుకురావద్దు: గాలి భానుప్రకాశ్

image

తనని కలవడానికి వచ్చేవారు శాలువాలు, పూలబొకేలు తీసుకురావద్దని నగరి  ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ విజ్ఞప్తి చేశారు. అభిమానం కోసం, శుభాకాంక్షలు తెలపడానికి ఏదైనా తీసుకురావాలంటే విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు, పెన్నులు, స్టడీ మెటీరియల్ లాంటివి తీసుకు రావాలని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, నాయకులు దీనిని విన్నపంగా భావించాలని తెలిపారు.

Similar News

News September 15, 2025

కాణిపాకంలో రేపు లడ్డూ వేలంపాట

image

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి మహాప్రసాదం లడ్డూకు బహిరంగంగా వేలం నిర్వహిస్తున్నట్లు ఈవో పెంచల కిశోర్ తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తెప్పోత్సవాలను నిర్వహించనున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు రేపు 21వ రోజు కావడంతో 21 కేజీల లడ్డూను తెప్పోత్సవం ముగిసిన తర్వాత కోనేరు ఎదుట వేలం వేయనున్నారు.

News September 15, 2025

చిత్తూరు SPగా తుషార్ డూడీ బాధ్యతలు

image

చిత్తూరు జిల్లా 68వ SPగా తుషార్ డూడీ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని నూతన ఎస్పీ తెలిపారు. గతంలో ఉన్న ఎస్పీ మణికంఠ స్థానంలో బాపట్ల నుంచి ఈయన బదిలీపై వచ్చారు.

News September 14, 2025

జిల్లా కలెక్టర్‌గా తవణంపల్లి వాసి

image

తవణంపల్లి మండలం వెంగంపల్లికి చెందిన ప్రభాకర్ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడంతో స్వగ్రామంలో గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాలలో వారి తల్లితండ్రులు మునెమ్మ, దొరస్వామి రెడ్డి పాల్గొన్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కలెక్టర్ స్థాయికి ఎదగడం అభినందనీయమని గ్రామస్థులు హర్ష వ్యక్తం చేశారు.