News July 15, 2024
నగర అభివృద్ధికై మంత్రి, సీఎంతో చర్చిస్తా: బండి సంజయ్
కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తానని MP బండి సంజయ్ అన్నారు. ఆదివారం KNRలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రెండు సార్లు కార్పొరేటర్‌గా పని చేసిన తనను గుర్తించి సన్మానించడం గౌరవంగా ఉందన్నారు. స్మార్ట్‌సిటీ కింద రూ.765 కోట్లు ఇప్పిటికే వచ్చాయని, ఇంకా రూ.176 కోట్లు రావాల్సి ఉందన్నారు. ప్రణాళిక అమలుకు మంత్రి పొన్నం, MLA గంగుల కమలాకర్‌తో పాటు.. CM రేవంత్ రెడ్డిని కలిసి చర్చిస్తానని తెలిపారు.
Similar News
News November 28, 2024
పండగలు మీకు.. పస్తులు రైతులకా?: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించనున్న రైతు పండగలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్రంగా మండిపడ్డారు. రైతు భరోసాకు ఎగనామం పెట్టి, రుణమాఫీ పేరుతో పంగనామాలు పెట్టి, లగచర్ల రైతులను జైలుపాలు చేసి అల్లుడి కళ్లలో ఆనందం చూసినందుకా? రైతును నిండా ముంచినందుకా? వ్యవసాయాన్ని ఆగం చేసినందుకా? రైతు పండుగలు అని ప్రశ్నించారు. పండుగలు మీకు.. పస్తులు రైతులకా? అని విమర్శించారు.
News November 28, 2024
కరీంనగర్: చలికాలం జాగ్రత్త!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి నెమ్మదిగా పంజా విసురుతోంది. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో ఆహారం, నీటితో అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, అందుకు మూడు పూటలా వేడి ఆహారంతో పాటు కాచి చల్లార్చిన గోరువెచ్చని నీటిని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
News November 28, 2024
KNR: వణికిస్తున్న చలి.. గ్రామాల్లో చలి కాగుతున్న యువత
చలి తీవ్రత అధికమవడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. పెరుగుతున్న చలికి గ్రామాల్లో ఉమ్మడి KNR ప్రజలు చలి మంటలు వేసుకుని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఒకే చోట గుమికూడి చిన్ననాటి గుర్తులను జ్ఞాపకం చేసుకుంటూ చలికాగే రోజులు ప్రస్తుతం కనిపిస్తోంది. గతంలో గ్రామాల్లో ఆరు బయట గడ్డి, టైర్లు, కట్టెల మంట వేసుకొని చలి కాగు సేదతీరే వారు. ఇప్పుడు అదే పరిస్థితి పూర్వకాలం నాటి జ్ఞాపకాలను గుర్తుతెస్తోంది.