News August 25, 2024

నగర వనాల అభివృద్ధికి నిధులు మంజూరు: పవన్ కళ్యాణ్

image

రాష్ట్రంలో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నగరవనాలు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. 11 మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో నూతనంగా నగరవనాలు అభివృద్ధి నిమిత్తం తొలి విడతగా రూ.15.4కోట్లను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నిధులను మంజూరు చేసిందన్నారు.

Similar News

News November 28, 2024

‘వైసీపీ త్వరలో అంతరించి పోతుంది’

image

వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. గుంటూరులో గురువారం కనపర్తి మీడియాతో మాట్లాడారు. పుష్ప అంటే మహిళ అని అంబటి భావిస్తున్నారని, రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడానికి అంబటికి 30ఏళ్లు పట్టిందని అన్నారు. అంతరించిన ప్రాంతీయ పార్టీల జాబితాలోకి త్వరలో వైసీపీ చేయబోతుందని జోస్యం చెప్పారు. 

News November 28, 2024

వేమూరు: రూ.20 వేల జీతంతో ఉద్యోగాలు

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కార్యాలయం, సీడ్ ఆప్ వారి సంయుక్త ఆధ్వర్యంలో గురువారం వేమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ప్రణయ్ బుధవారం తెలిపారు. మైక్రోసాఫ్ట్ సొల్యూషన్స్, కేఎల్ గ్రూప్, మెడ్ ప్లస్ ఫార్మసీ, ఏయూ బ్యాంక్ కంపెనీలు హాజరవుతాయని వందకు పైగా ఖాళీలు ఉన్నాయన్నారు. వేతనం రూ.10 నుంచి 20వేల వరకు ఉంటుందన్నారు.

News November 28, 2024

గుంటూరు: లోకేశ్ ప్రతిపాదనపై మీరేం అంటారు?

image

గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై బుధవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి నారా లోకేశ్ కీలక ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. గంజాయి వాడే కుటుంబాలకు సంక్షేమ పథకాలు నిలిపివేస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దీని సాధ్యాసాధ్యాలపై క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మరి ఈ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా? కామెంట్ చేయండి.