News July 4, 2025
నగర వైభవాన్ని చాటిచెప్పేలా విజయవాడ ఉత్సవ్: ఎంపీ చిన్ని

ఇంద్రకీలాద్రిపై ఏటా శరన్నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో విజయవాడ ఉత్సవ్‌పై జరిగిన ప్రాథమిక సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశా, సీపీ రాజశేఖర్ బాబు, తదితరులు పాల్గొని సాధ్యాసాధ్యాలపై చర్చించారు. విజయవాడ నగర పర్యటన మధురాను భూతులు మిగిల్చేలా కార్యక్రమాలు నిర్వహించాలని చూస్తున్నట్లు తెలిపారు.
Similar News
News July 5, 2025
HYD: ప్రైవేటు బడి పుస్తకాలతో.. భుజం బరువెక్కుతుంది.!

HYDలో కొన్ని ప్రైవేటు పాఠశాలల వ్యవహారంతో బడి పుస్తకాలు మోతకోలుగా మారుతున్నాయి. పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, ప్రాక్టీస్ నోట్స్, సబ్జెక్టు మెటీరియల్ ఇలా రకరకాల పేర్లతో పిల్లల భుజాలకు కిలోల బరువును వేలాడేస్తున్నారు. దీంతో పిల్లల భుజం బరువెక్కుతోంది. సాధారణంగా ప్రభుత్వం పంపిణీ చేసే పాఠ్యపుస్తకాలు, నోట్స్ సరిపోతుంది. మరీ మీ పిల్లల పరిస్థితి ఎలా ఉంది.
News July 5, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News July 5, 2025
ఓదెల: ప్రభుత్వ పాఠశాలల ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష

ఓదెల మండలంలోని పాఠశాలల పనితీరుపై కలెక్టర్ కోయ శ్రీ హర్ష హెడ్‌మాస్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వార్షిక ప్రణాళికను అమలు చేయాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మ్యాథ్స్, ఆంగ్లం, తెలుగు విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలని అన్నారు. టీచర్ల హాజరు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా నమోదు చేయాలని, పాఠశాలల మౌలిక వసతుల కోసం ప్రతిపాదనలు పంపించాలని, హాజరును 60%కి పెంచాలని ఆదేశించారు.