News April 16, 2025
నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్.. నిందితుడి అరెస్ట్

డబ్బు కోసం యువతిని నగ్న చిత్రాలతో బెదిరిస్తున్న కర్నూలు(D) కల్లూరు(M) తటకనాపల్లికి చెందిన హరీశ్‌ను అరెస్టు చేసినట్లు ఆలమూరు SI అశోక్ తెలిపారు. కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు చెప్పారు. మూడేళ్ల క్రితం ఓ యాప్ ద్వారా యువతి పరిచయమైందని తెలిపారు. నగ్నంగా వీడియో కాల్ మాట్లాడటంతో స్క్రీన్ షాట్స్ తీసి మూడు ఇన్‌స్టా ఖాతాల్లో పోస్ట్ చేసి వేధించాడని వెల్లడించారు.
Similar News
News November 8, 2025
HYD: పార్కు కాదు.. పచ్చని డంపింగ్ యార్డు

డంపింగ్ యార్డ్ అనగానే చెత్త, చెదారంతో నిండిన దుర్వాసన గూడు గుర్తుకువస్తుంది. కానీ HYD శివారు పీర్జాదిగూడ బల్దియా పర్వతాపూర్ డంపింగ్ యార్డ్ ఆ అభిప్రాయాన్ని తలకిందులు చేస్తోంది. చెత్త మాయమై, పచ్చదనం పరచుకుంది. పచ్చిక బయళ్లు, ఓపెన్ జిమ్‌లు అలరారుతున్నాయి. ‘ఇది డంపింగ్ యార్డా? లేక పార్కా?’ అనే అనుమానం కలిగిస్తోంది.
News November 8, 2025
గూడూరు: ఒక్కడే కొడుకు.. పుత్ర శోకం మిగిల్చాడు!

గూడూరు మండల కేంద్రానికి చెందిన <<18232373>>షేక్ సోహెల్<<>> శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మండలంలో పత్రిక విలేఖరిగా పనిచేస్తున్న యాకూబ్‌కు ఒక్కగానొక్క తనయుడు సోహెల్. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. తన తనయుడు ఉద్యోగాలకు ప్రయత్నిస్తూనే తమ మొబైల్ షాప్‌లో చేదోడు వాదోడుగా ఉండేవాడు. కొడుకు ఇక రాడని తండ్రి కన్నీటి పర్యంతమైన తీరు పలువురి హృదయాలను ద్రవింపజేసింది.