News December 24, 2025

నటుడిని పెళ్లి చేసుకున్న వీనస్ విలియమ్స్

image

అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ వీనస్ విలియమ్స్, ఇటాలియన్ యాక్టర్ ఆండ్రియా ప్రెటి వివాహం చేసుకున్నారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో 5 రోజులపాటు వీరి పెళ్లి వేడుకలు జరిగాయి. పెళ్లి విషయాన్ని వీనస్ SMలో వెల్లడించారు. ఈ 45 ఏళ్ల టెన్నిస్ స్టార్ 7సార్లు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఛాంపియన్‌గా నిలిచారు. గత 16 నెలలుగా ఆటకు దూరంగా ఉన్న ఆమె JANలో ఆక్లాండ్‌లో జరిగే WTA టూర్ 33వ స్ట్రెయిట్ సీజన్‌లో పాల్గొననున్నారు.

Similar News

News February 14, 2026

నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్ 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, ఇంటర్, టెన్త్ అర్హతగల వారు మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nsi.gov.in

News February 14, 2026

25వేలకు పైగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వచ్చేసింది

image

అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదలైంది. GD, టెక్నికల్​, క్లర్క్​/ స్టోర్​కీపర్​ టెక్నికల్​, ట్రేడ్స్​మన్​, సోల్జర్​ ఫార్మా, టెక్నికల్​ నర్సింగ్​ అసిస్టెంట్​ తదితర విభాగాల్లో 25వేలకుపైగా ఖాళీలున్నాయి. పోస్టును బట్టి 8th క్లాస్, టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసై ఉండాలి. 17½-25 ఏళ్ల వయసుండాలి. APR 1 వరకు అప్లై చేసుకోవచ్చు. జూన్ 1-15 వరకు ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది.
వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in/

News February 14, 2026

అకౌంట్‌లో ఉన్న డబ్బుతో వడ్డీ పొందొచ్చు!

image

రిస్క్ లేకుండా అకౌంట్‌లో ఉన్న డబ్బుతో వడ్డీ పొందవచ్చు. మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ (MODS) ద్వారా సేవింగ్స్ అకౌంట్‌లో నిర్ణీత పరిమితి దాటిన డబ్బు ఆటోమేటిక్‌గా FDగా మారుతుంది. అవసరమైనప్పుడు ఆ డబ్బును ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తంపై వడ్డీ కొనసాగుతుంది. తక్కువ రిస్క్‌తో ఎక్కువ వడ్డీ వస్తుంది. చాలా బ్యాంకుల్లోనూ ఈ సౌకర్యం ఉన్నప్పటికీ లిమిట్‌లో తేడాలున్నాయి. SHARE IT