News September 7, 2025
నడిగూడెం: కారు ఢీకొని వ్యక్తి మృతి

నడిగూడెం మండలం ఎక్లాస్ ఖాన్ పేట గ్రామానికి చెందిన బానోతు సేవ్య(65) ఆదివారం ఉదయం ముకుందాపురంలో కూరగాయలు అమ్ముకొని తిరిగి ఇంటికి వెళుతుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుని మనవడు సాయి భరత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.
Similar News
News September 8, 2025
GNT: వృద్ధురాలిపై అత్యాచారం

బాపట్ల పరిధిలోని నగరం మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ గ్రామానికి చెందిన యువకుడు తన స్నేహితులతో కలిసి ఈనెల 1వ తేదీ రాత్రి మద్యం తాగాడు. ఆ తర్వాత మత్తులో తనకు నానమ్మ వరుసయ్యే 65 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేశాడు. బంధువులు గమనించి వృద్ధురాలిని గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి తరఫున నగరం పోలీసులకు ఆదివారం ఫిర్యాదు అందగా ఎస్ఐ భార్గవ్ కేసు నమోదు చేశారు.
News September 8, 2025
గణేష్ ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు: కలెక్టర్

నిర్మల్ జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా ముగిశాయని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శోభాయాత్రకు అన్ని శాఖలు తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ఎటువంటి లోటుపాట్లు లేకుండా కార్యక్రమం పూర్తయిందని ఆమె అభినందించారు. సహకరించిన పోలీస్, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ శాఖలకు, గణేష్ కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
News September 8, 2025
అధికారిక మీటింగ్‌లో సీఎం భర్త.. మండిపడ్డ ఆప్

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఆమ్ ఆద్మీ పార్టీ ఫైర్ అయింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆమె భర్త మనీశ్ గుప్తా పాల్గొనడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇది ‘పంచాయత్’ వెబ్ సిరీస్‌ను తలపిస్తోందని విమర్శించింది. అధికారిక మీటింగ్‌లో సీఎం పక్క ఛైర్‌లో ఆమె భర్త కూర్చున్న ఫొటోను Xలో షేర్ చేసింది. ఈ చర్య ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమని మండిపడింది.