News December 4, 2024
నడిగూడెం: బంతి తోట.. లాభాల పంట

బంతి తోట సాగుతో మంచి లాభాలు వచ్చాయని బంతితోట సాగు రైతు మేకపోతుల వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. మండలంలోని బృందావనపురం గ్రామానికి చెందిన రైతు నడిగూడెం నుంచి రామచంద్రపురం వెళ్లే ప్రధాన రహదారి పక్కన తనకున్న వ్యవసాయ భూమిలో కొంత 0.50 సెంట్లలో బంతితోట సాగు చేశారు.కింటాకు రూ.5,000 – 6000 ధర పలుకుతుందని తెలిపారు. బంతి తోట సాగు చేయాలని నిర్ణయించుకొని వరికి బదులుగా బంతితోట సాగు చేయటంతో లాభసాటిగా ఉందన్నారు.
Similar News
News May 7, 2025
మ్యుటేషన్‌తో వివాదాలకు చెక్: నల్గొండ కలెక్టర్

భూభారతి చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేసి రైతులకు న్యాయం జరిగేలా రెవెన్యూ యంత్రాంగం పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కనగల్ మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూభారతిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. భూములు సర్వే చేసిన తర్వాత మ్యుటేషన్ చేసినట్లయితే ఎలాంటి వివాదాలకు అవకాశం ఉండదన్నారు.
News May 7, 2025
జిల్లాలో ముగిసిన ఓపెన్ స్కూల్ పరీక్షలు

నల్గొండ జిల్లాలో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా ఈనెల 20న ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే ఈనెల 24న మిర్యాలగూడలోని ఒక పరీక్ష కేంద్రంలో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తుండగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పట్టుకొని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే.
News May 7, 2025
NLG: పనితీరు ఆధారంగా అంగన్వాడీలకు ఇక గ్రేడింగ్!

NLGజిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు ఇక నుంచి మొక్కుబడిగా నిర్వహించకుండా ఉన్నతాధికారుల పర్యవేక్షణ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్నారులు కేంద్రాలకు వచ్చి పోవడంతోనే సరిపెట్టకుండా వారికి ఆటాపాట నేర్పించాలనే దానిపై దృష్టి పెట్టింది. అందుకే కేంద్రాల పనితీరు ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి సీతక్క చెప్పిన విషయం తెలిసిందే. మంచి గ్రేడింగ్ ఉన్న కేంద్రాలకు అవార్డులను సైతం ఇవ్వనున్నారు.