News July 13, 2024
నడిరోడ్డుపై ప్రయాణికులకు అగచాట్లు
విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం అర్ధరాత్రి బాపులపాడు మం. వీరవల్లి వద్ద మొరాయించింది. బస్సుకు మరమ్మతు చేయకుండా డ్రైవర్, క్లీనర్ పరారవ్వడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ నిరసనకు దిగారు. దీంతో వీరవల్లి పోలీసులు రంగ ప్రవేశం చేసి సమస్యను పరిష్కరించారు. బస్ యాజమాన్యం టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వడంతో ఇతర బస్సుల్లో వెళ్లిపోయారు.
Similar News
News November 27, 2024
ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు?
ఏపీలో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కనకమేడల రవీంద్ర రాజ్యసభ ఎంపీగా పనిచేయగా.. ఆయన పదవీకాలం 2024 ఏప్రిల్‌తో ముగిసింది. జిల్లా నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటు మరికొంతమందిని రాజ్యసభకు పంపే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. కాగా ఈ 3 పదవులను NDA కూటమి ప్రభుత్వం ఎవరికి ఇవ్వనుందో మరికొద్ది రోజులలో తెలియనుంది.
News November 27, 2024
ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్
ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను వేగవంతం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన చాంబర్ నుంచి సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం క్రింద ఇంకా చేపట్టవలసిన పెండింగ్ పనులను త్వరితగతిన ప్రారంభించాలన్నారు.
News November 26, 2024
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫలితాలు విడుదల
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో ఇటీవల నిర్వహించిన బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సు 1వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఆయా పరీక్షలు రాసిన విద్యార్థులు రిజల్ట్స్ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సీటీ అధ్యాపక వర్గాలు సూచించాయి. ఈ పరీక్షల ఫలితాలకై యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చూడాలని విద్యార్థులకు ఈ మేరకు ఒక ప్రకటనలో సూచించాయి.