News July 18, 2024
నన్నయ, JNTUK ఇన్‌ఛార్జి వీసీలు వీరే

రాజానగరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వీసీ(వైస్ ఛాన్సలర్)గా ప్రొ.వై.శ్రీనివాసరావు నియమితులయ్యారు. ప్రస్తుతం జియో సైన్సెస్ విభాగంలో ప్రొఫెసర్‌గా, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్ డీన్‌గా ఉన్న శ్రీనివాసరావు.. ఇన్‌ఛార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ JNTU ఇన్చార్జి వీసీగా అదే వర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తిస్తున్న ఫ్రొ.KVSG మురళీకృష్ణ నియమితులయ్యారు.
Similar News
News October 26, 2025
అక్టోబర్ 27న పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

వాతావరణ పరిస్థితుల కారణంగా అక్టోబర్ 27న నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ (ప్రజా గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. ప్రజలు తమ ఫిర్యాదులు సమర్పించడానికి కలెక్టరేట్‌కు నేరుగా రావాల్సిన అవసరం లేదని తెలిపారు. టోల్‌ఫ్రీ నంబర్ 1100కు కాల్ చేయవచ్చని లేదా మీ కోసమే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో తమ అర్జీలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు.
News October 25, 2025
సోమ, మంగళవారాల్లో పాఠశాలలకు సెలవు: కలెక్టర్

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని పాఠశాలలకు సోమ, మంగళవారాల్లో సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. సోమవారం రోజున నిర్వహించవలసిన ‘పీజీఆర్ఎస్ – మీ కోసం’ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఇంటర్మీడియట్ కళాశాలల నిర్వహణపై స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
News October 25, 2025
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

వర్షాలు–సైక్లోన్ హెచ్చరికల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. శనివారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద అధికారులతో ఆమె సమావేశం నిర్వహించి, తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. మండలాధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, ముందస్తు చర్యలు తప్పనిసరన్నారు. ప్రతి శాఖ సమన్వయంతో ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.


