News January 31, 2026

నన్ను రిటైరవ్వమన్న వారికి థాంక్స్: జకోవిచ్

image

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లిన టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ విమర్శకులపై సెటైర్లు వేశారు. ‘చాలామందికి నాపై నమ్మకం లేదు. కొందరు ఎక్స్‌పర్ట్స్ రిటైర్ అవ్వాలని సలహాలు కూడా ఇచ్చారు. ఆ మాటలు తప్పని నిరూపించేలా నన్ను మోటివేట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు’ అని ఎద్దేవా చేశారు. 25 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు 38 ఏళ్ల నొవాక్ అడుగు దూరంలో ఉన్నారు.

Similar News

News February 14, 2026

T20WC నుంచి ఒమన్ ఔట్

image

ఇవాళ ఐర్లాండ్‌ చేతిలో ఓటమితో T20WC-2026 నుంచి ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా ఒమన్ నిలిచింది. గ్రూప్-Bలో ఉన్న ఆ జట్టు లీగ్ దశలో ఆడిన 3 మ్యాచుల్లోనూ ఓడింది. దీంతో మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదే గ్రూపులో శ్రీలంక, జింబాబ్వే ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయాలతో 1, 2 స్థానాల్లో కొనసాగుతున్నాయి. అటు లీగ్ దశలో ఒమన్ తన చివరి మ్యాచ్‌ను FEB 20న ఆస్ట్రేలియాతో ఆడనుంది.

News February 14, 2026

AP వ్యవసాయ రంగం వృద్ధి రేటు 7.83 శాతం: అచ్చెన్న

image

భారత వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ వాటా 10 శాతంగా ఉందని, వ్యవసాయ రంగంలో AP 7.83% వృద్ధి రేటు సాధించిందని మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్ సందర్భంగా వెల్లడించారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లు జరిపి రికార్డు స్థాయిలో 24 గంటల్లోనే రూ.9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. అన్నదాత సుఖీభవ-PM కిసాన్ కింద 2025-26లో రూ.6,309 కోట్లు చెల్లించామని.. 2026-27లో దానిని రూ.6,600 కోట్లకు పెంచామన్నారు.

News February 14, 2026

బంగినపల్లి మామిడి@ టన్ను రూ.1.75 లక్షలు

image

AP: మామిడి పండ్లకు రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి. తోతాపురి టన్ను ధర ₹1.10 లక్షలకు చేరగా, బంగినపల్లి మామిడి(కవర్లు కట్టి సాగు చేసినవి)కి ₹1.75 లక్షల రేటు పలికింది. దీంతో ఎన్టీఆర్ జిల్లాలోని రైతులకు కాసుల వర్షం కురుస్తోంది. గతంతో పోలిస్తే ఈ రేటు ₹50వేలు ఎక్కువ కావడం విశేషం. కాయల నాణ్యత తగ్గకుండా ఉండేందుకు వాటికి కవర్లను(ఒక్కో కవర్ ₹2) కడుతుంటారు. వీటికి ప్రభుత్వం 50% సబ్సిడీ కూడా ఇస్తుంది.