News August 27, 2025

నయీంనగర్‌: తృణ ధాన్యాలతో బొజ్జ గణపయ్య

image

తృణ ధాన్యాలతో కలిగే లాభాలను వివరించే ఓ ప్రయత్నంలో చిన్నారి పేపర్‌పై బొజ్జగణపయ్యను రూపొందించింది. హనుమకొండలోని నయీంనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సాయిప్రకాష్ కూతురు లాస్య వినూత్నంగా తృణధాన్య బొజ్జగణపయ్యను తయారుచేసింది. పండుగలు, పర్యావరణ హితం, సంస్కృతీ, సంప్రదాయాలు తదితర అంశాలపై లాస్య తరచుగా చిత్రాలు, పెయింటింగ్ తదితర కళా ప్రదర్శనలు చేస్తోందని ఆమె తండ్రి సాయిప్రకాష్ తెలిపారు.

Similar News

News August 27, 2025

మెదక్: రేపు విద్యాసంస్థలకు సెలవు..!

image

మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు DEO రాధా కిషన్ తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సెలవు ప్రకటించినట్లు అధికారులు పేర్కొన్నారు. పాఠశాల అధ్యాపకులు, తల్లిదండ్రులు అధికారిక ప్రకటనకు అనుగుణంగా సమన్వయం పాటించాలని సూచించారు.

News August 27, 2025

TU: PG, B.Ed, M.Ed పరీక్షలు వాయిదా

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రేపటి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పరీక్ష తేదీలను తరువాత ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. సంబంధిత కళాశాల యాజమాన్యాలు గమనించాలని కోరారు.

News August 27, 2025

భారీ వర్షాలు.. బయటకు రాకండి: NZB కలెక్టర్

image

భారీ వర్షాలు కురుస్తున్నందున శ్రీరాంసాగర్ పరీవాహక ప్రాంతం, నదులు, వాగులు, జలాశయాల పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. భారీ వర్షాలతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తి, ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని, అవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దన్నారు. చేపలవేట, ఈత సరదా కోసం చెరువులు, కాలువలు, కుంటలు, ఇతర జలాశయాల వద్దకు వెళ్లవద్దన్నారు.