News January 9, 2026
నరదిష్టి ప్రభావం తొలగిపోవాలంటే?

నరదిష్టి ప్రభావంతో ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వాటి నుంచి బయటపడటానికి జ్యోతిష నిపుణులు కొన్ని పరిహారాలు సూచిస్తున్నారు. ‘సముద్ర జలాలను ఇల్లు, వ్యాపార స్థలాల్లో చల్లాలి. దొడ్డు ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయాలి. మంగళవారం ఎరుపు వస్త్రంలో ఉప్పు కట్టి ఇంటి ముందు వేలాడదీయాలి. మరుసటి రోజు చెట్టు మొదట్లో వేయాలి. సాంబ్రాణి ధూపం, వినాయకుడి వద్ద దీపం వెలిగించడం మంచి ఫలితాలను ఇస్తాయి’ అంటున్నారు.
Similar News
News February 13, 2026
టమాటాతో చర్మానికి తాజాదనం

మనం కూరల్లో ఎక్కువగా వాడే టమాటాతో అనేక సౌందర్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. చర్మ సంరక్షణలో టమాటా ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం.. * టమాటా గుజ్జులో కాస్త కీరా రసం కలిపి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది. * రెండు చెంచాల పెరుగులో టమాటా రసం, బాదం పేస్ట్ కలిపి ముఖానికి రాయడం వల్ల నిర్జీవంగా ఉన్న చర్మం తాజాగా మారుతుంది.
News February 13, 2026
పట్టణాల్లో ‘హ్యాపీ సండే’

AP: పట్టణ ప్రజల్లో ఆరోగ్యవంతమైన జీవనశైలిని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నెల 22న రాష్ట్రవ్యాప్తంగా హ్యాపీ సండే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ప్రతి నెలా 2, 4వ ఆదివారాల్లో ఉదయం రెండు గంటలపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. యోగ, ఫిట్‌నెస్ సెషన్లు, క్రీడా పోటీలు, సృజనాత్మక చర్చల అమలుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది.
News February 13, 2026
పూత, పిందె దశలో మామిడి పంటకు నీరు ఎలా ఇవ్వాలి?

మామిడి తోటలోని చెట్లు అన్నింటికీ పూ మొగ్గలు వచ్చినప్పుడు తోటకు తేలికగా నీరు పెట్టాలి. పిందెలు ఏర్పడ్డాక మామిడి చెట్లకు వీలును బట్టి 15 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 తడుల నీటిని అందించాలి. దీని వల్ల పిందెలు రాలడం తగ్గి కాయలు పెద్దవిగా నాణ్యంగా పెరుగుతాయి. మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో అవసరానికి మించి చెట్లకు నీరు పెట్టడం వల్ల పిందెలు అధికంగా రాలిపోయే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


