News August 24, 2025
నరసన్నపేట: ఎరువుల దుకాణాల్లో ముమ్మర తనిఖీలు

నరసన్నపేట మండల కేంద్రంలో ఉన్న పలు ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ జిల్లా జేడీ త్రినాథ స్వామి తమ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆదివారం జరిగిన ఈ సోదాల్లో ఏడీ వెంకట మధు, ఏవో సూర్య కుమారిలు ఉన్నారు. ఎరువులు బ్లాక్ మార్కెట్‌లోకి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జేడీ దుకాణదారులకు హెచ్చరించారు. రైతులకు అందుబాటులో ఎల్లవేళలా ఎరువులు ఉంచాలన్నారు.
Similar News
News August 24, 2025
సిక్కోలు జిల్లాలో భార్యాభర్తలు ఆత్మహత్య

పింఛన్ రద్దై మనస్థాపం చెందిన కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన గార (M) అంపోలులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..గ్రామస్థుడు అప్పారావు(అంధుడు)కు వస్తున్న దివ్యాంగ పెన్షన్ రద్దైనట్లు ఇటీవల నోటీసులొచ్చాయి. ఆర్థికంగా సతమతమైన అప్పారావు భార్య లలిత, కుమార్తె దివ్య(17)లతో కలిసి శనివారం రాత్రి భోజనంలో ఎలుకల మందు కలుపుకొని సూసైడ్ చేసుకున్నారు. భార్యాభర్తలు మృతి చెందగా కుమార్తె చికిత్స పొందుతోంది.
News August 24, 2025
జలమూరు: శిథిలస్థితికి ఏళ్ల చరిత్ర గల ఆలయం..కాపాడాలని వినతి

దక్షిణ కాశీగా శ్రీ ముఖలింగేశ్వర ఆలయం పేరుగాంచింది. ఈ దేవాలయంలోని శిల్ప సంపదను కాపాడాలని అర్చకుడు రాజశేఖర్ మాన్యుమెంట్ అథారిటీ ఛైర్మన్‌ను శనివారం ఢిల్లీలో కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయంలోని పురాతన శాసనాలు, కట్టడాలు పెచ్చులూడి శిథిలమవుతున్నాయని వివరించారు. అభివృద్ధికి చేసేందుకు అడుగులు వేయాలని ఆయను కోరారు. దీనిపై ఛైర్మన్ సానుకూలంగా స్పందించారని రాజశేఖర్ తెలిపారు.
News August 24, 2025
శ్రీకాకుళం జిల్లాలో(ఎస్‌ఏ) ఇంగ్లిష్ ఫస్ట్ ర్యాంక్ బూర్జ వాసికే

ఇటీవల విడుదలైన 2025 డీఎస్సీ ఫలితాల్లో బూర్జ మండలం అన్నంపేట గ్రామానికి చెందిన మీసాల గోవిందరావు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ విభాగంలో జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. ఈ విజయం పట్ల తల్లిదండ్రులు గ్రామస్థులు , స్నేహితులు గోవిందరావును అభినందించారు.