News April 25, 2024
నరసరావుపేటలో ఆరవ రోజు 64 నామినేషన్లు

జిల్లాలో ఆరవ రోజు బుధవారం మొత్తం 64 నామినేషన్లు దాఖలు అయ్యాయని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి శివశంకర్ తెలిపారు. అత్యధికంగా నరసరావుపేట పార్లమెంటుకు 10, అసెంబ్లీ స్థానానికి 11, నామినేషన్లు వేశారని చెప్పారు. పెదకూరపాడు అసెంబ్లీకి 7, చిలకలూరిపేట అసెంబ్లీకి 7 సత్తెనపల్లి అసెంబ్లీకి 9 వినుకొండ అసెంబ్లీకి 6, గురజాల అసెంబ్లీకి 7, మాచర్ల అసెంబ్లీకి 7 ,నామినేషన్లు దాఖలు చేశారని తెలిపారు.
Similar News
News September 11, 2025
ఇది గుంటూరు జిల్లా ప్రజలు గర్వించదగిన క్షణం

కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (NCAP) కింద జరిగిన ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్’లో గుంటూరు నగరం అరుదైన రికార్డు సృష్టించింది. ఈ సర్వేలో గుంటూరు దేశవ్యాప్తంగా ఆరో ర్యాంకును సాధించింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి టాప్ టెన్‌లో స్థానం పొందిన ఏకైక నగరం గుంటూరు. ఇది గుంటూరు జిల్లా ప్రజలకు గర్వకారణమని అధికారులు తెలిపారు.
News September 10, 2025
గుంటూరు సంయుక్త కలెక్టర్‌గా అశుతోష్ శ్రీవాత్సవ బాధ్యతలు

గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌గా అశుతోష్ శ్రీవాత్సవ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా ఆయన గుంటూరుకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, ఏవో పూర్ణచంద్రరావు తదితరులు సంయుక్త కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
News September 10, 2025
13న గుంటూరులో జాతీయ లోక్ అదాలత్

గుంటూరు జిల్లాలో ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. వాహన ప్రమాద బీమా, చెక్ బౌన్స్, చిన్న క్రిమినల్, కుటుంబ వివాదాలు, సివిల్, బ్యాంక్, భూ వివాదం, విభజన వంటి కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వివినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.