News August 17, 2025
నరసరావుపేటలో కేజీ చికెన్ ధర ఎంతంటే?

నరసరావుపేట పట్టణ, పరిసర ప్రాంతాల్లో ఆదివారం లైవ్ కోడి కేజీ గత వారంతో పోలిస్తే రూ. 8 తగ్గి రూ.121గా విక్రయిస్తున్నారు. స్కిన్ లెస్ రూ. 240 నుంచి రూ. 260, విత్ స్కిన్ రూ. 220 నుంచి రూ. 240 మాంసప్రియలకు అందుబాటులో ఉంది. మటన్ ధర కేజీ రూ. 900 వద్ద కొనసాగుతుంది. 100 కోడిగుడ్లు రూ. 520 విక్రయిస్తున్నారు. లైవ్ కోడి ధర తగ్గినప్పటికీ గతవారం ధరలనే చికెన్ స్టాల్స్ వ్యాపారులు కొనసాగిస్తున్నారు.
Similar News
News August 17, 2025
నాగావళి నదిలో స్నానానికి దిగి మృతి

పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివారం ఉదయం విషాదం నెలకొంది. పాలకొండ మండలం అన్నవరంలో బంధువుల ఇంటికి వచ్చిన పవన్ (16) నాగావళి నదిలో స్నానానికి దిగి మృతి చెందాడు. మృతి చెందిన పవన్ ఆమదాలవలస మండలం వజ్రగూడ గ్రామానికి చెందినవాడు. సెలవులకు బంధువుల ఇంటికి వచ్చి మృతి చెందడంతో ఇటు అన్నవరంలోనూ అటు వజ్రగూడ గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి.
News August 17, 2025
NZB: 638 సంఘాలు.. రూ 72.22 కోట్ల రుణాలు

నిజామాబాద్ జిల్లాలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ద్వారా స్వయం సహాయక సంఘాలకు భారీగా రుణాలు మంజూరయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 638 సంఘాలకు బ్యాంకు లింకేజి ద్వారా రూ. 72.22 కోట్లు వడ్డీలేని రుణాలు ఇప్పించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 9,094 స్వయం సహాయక సంఘాల్లో 90,940 మంది సభ్యులున్నారు. పీఎం స్వనిధి కింద 4 మున్సిపాలిటీలలో వీధి వ్యాపారులకు రూ.10 వేల చొప్పున రుణాలు అందజేశారు.
News August 17, 2025
ASF: పెండింగ్ కేసులు త్వరగా పూర్తిచేయాలి: ఎస్పీ

పెండింగులో ఉన్న కేసులు త్వరగా పూర్తి చేయాలని, మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. శనివారం కాగజ్ నగర్ పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండాలని, పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని, మత్తుపదార్థాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.