News December 29, 2024
నరసరావుపేటలో సీఎం పర్యటన ఇలా.!
నరసరావుపేట మండలం యల్లమంద గ్రామానికి ఈనెల 31న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుంటారు. 11.40 వరకు పింఛన్లు అందజేస్తారు. అనంతరం గ్రామంలోని ఆలయాన్ని సీఎం సందర్శిస్తారు. మధ్యాహ్నం కోటప్పకొండకు చేరుకొని 2.20కి త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. భోజనం అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకొని 3.10లకు ముఖ్యమంత్రి తిరిగి ఉండవల్లి చేరనున్నారు.
Similar News
News January 1, 2025
నిజాంపట్నం: భర్తను హత్య చేసిన భార్య
భర్తను భార్య హత్య చేసిన దారుణ ఘటన నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీలోని పెద్దూరు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. 31వ తేదీ రాత్రి అమరేంద్రబాబు మద్యం తాగి ఇంటికి రాగా భార్యాభర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో భర్త అమరేంద్ర (38) తలపై భార్య కర్రతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న రేపల్లె రూరల్ సురేశ్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 1, 2025
చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
నూతన సంవత్సరం రోజున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం తాతపూడి జాతీయ రహదారి రక్తమోడింది. ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు మార్టూరు వైపు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మహిళను చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 1, 2025
పల్నాడు: కొత్త సంవత్సరం వేళ కుటుంబంలో తీవ్ర విషాదం
నూతన సంవత్సరం వేళ ఓ కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది. కుమారుడికి కేక్ కొనిచ్చేందుకు తీసుకెళ్తుండగా లారీ మృత్యువు రూపంలో వెంటాడింది. నకరికల్లు మండలం త్రిపురాపురం గ్రామం వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాద విషాదాంతమిది. గ్రామానికి చెందిన దుర్గారావు బైక్‌పై కుమారుడితో కలిసి వెళ్తుండగా లారీ ఢీకొనడంతో బాలుడు కార్తీక్ మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.