News February 4, 2025
నరసరావుపేట: అంగన్వాడీ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి

పేద కుటుంబాల వారు తమ పిల్లలను అంగన్వాడీ సెంటర్ల ద్వారా చదివించి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు సూచించారు. మంగళవారం పేద కుటుంబాలకు చెందిన వారికి మూడు చక్రాల రిక్షాలను అందజేశారు. పేదరికం నుంచి చదువు మాత్రమే బయటికి తీసుకువస్తుందన్నారు. చిన్నారులను చిత్తు కాగితాలు ఏరుకునేందుకు పంపవద్దని తల్లిదండ్రులను కలెక్టర్ కోరారు. ఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీవో మధులత ఉన్నారు.
Similar News
News February 25, 2026
రాజమండ్రి: ఆ పాలు తాగుతున్నారా? అయితే వెంటనే చెకప్ చేయించుకోండి!

రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. పాల వ్యాపారి గణేశ్ ఫోటో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ వ్యక్తి నుంచి పాలు కొనుగోలు చేసిన వారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఆసుపత్రుల్లో ముందస్తు చికిత్స పొందుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
News February 25, 2026
ఈ పొరపాటు చేస్తే పశువులకు అబార్షన్ అవుతుంది

కొన్ని పశువులు గర్భంతో ఉన్నప్పటికీ తీగలు వేస్తుంటాయి. దీనికి కారణం పశువులు గర్భంతో ఉన్నప్పుడు 4 లేదా 5వ నెలలో ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వల్ల తీగలు వేస్తాయి. దీన్నే జస్టేషనల్ హీట్ అంటారు. అందుకే ఎద ఇంజెక్షన్ వేసిన మూడు నెలల తర్వాత పశువులకు చూడి నిర్ధారణ పరీక్ష తప్పకుండా నిర్వహించాలి. ఇది చేయకుండా తీగలు వేసిందని మళ్లీ ఎద ఇంజెక్షన్ వేయిస్తే అబార్షన్ అవుతుందని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News February 25, 2026
విశాఖ: రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగికి టోకరా.. రూ.89 లక్షలు దోచేశాడు

నగరంలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగికి సుప్రీంకోర్టు నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆర్టీజీఎస్ ద్వారా రూ.89 లక్షలు కాజేయడంతో నష్టపోయానని తెలుసుకున్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయనగరానికి చెందిన సీహెచ్ రవి ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.


