News December 20, 2025
నరసరావుపేట: అక్రమార్కుల్లో వణుకు.. PS వద్ద కార్లు పరార్.!

చిట్టినాయుడు కేసు దర్యాప్తు పల్నాడు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రోడ్డు ప్రమాద కేసులో ప్రధాన నిందితుడైన చిట్టినాయుడు వద్ద నుంచి కార్లు కొనుగోలు చేసిన వ్యక్తులు పోలీసుల తనిఖీలకు భయపడి, తమ వాహనాలను నరసరావుపేట పోలీస్ స్టేషన్ వద్దే వదిలి వెళ్తున్నారు. ఇప్పటికే పోలీసులు 25 కార్లను స్వాధీనం చేసుకోగా, తాజాగా గుర్తుతెలియని వ్యక్తులు కార్లను స్టేషన్ వద్ద వదిలివెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
Similar News
News December 27, 2025
ఆల్కహాల్ కొంచెం తాగినా.. నోటి క్యాన్సర్ ముప్పు!

ఆల్కహాల్ కొంచెం తాగినా నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తాజా స్టడీలో వెల్లడైంది. మద్యం తీసుకోవడానికి సురక్షితమైన పరిమితి లేదు. ప్రతిరోజూ నిర్దిష్ఠ పరిమితిలో తాగినా ఓరల్ మ్యూకోసల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ 50% ఉంటుంది. లోకల్ తయారీ మద్యంతో ఆ ప్రమాదం ఎక్కువ. పొగాకు, మద్యం అలవాట్లు ఉన్నవారికి నోటి క్యాన్సర్ వచ్చే రిస్క్ 4రెట్లు ఎక్కువ. భారత్‌లో లక్ష మంది మగవారిలో 15మందికి నోటి క్యాన్సర్ వస్తోంది.
News December 27, 2025
డిసెంబర్ 27: చరిత్రలో ఈరోజు

☛ 1822: రేబిస్ టీకా సృష్టికర్త లూయీ పాశ్చర్ జననం
☛ 1911: కలకత్తా కాంగ్రెస్ సభలో తొలిసారిగా జనగణమన ఆలాపన
☛ 1939: టర్కీలో భూకంపం, 32 వేలమంది మృతి
☛ 1945: అంతర్జాతీయ ద్రవ్య నిధి స్థాపన
☛ 1965: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్(ఫొటోలో) జననం
☛ 2007: పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య
☛ 2009: నటుడు నర్రా వెంకటేశ్వరరావు కన్నుమూత
News December 27, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


