News April 10, 2025

నరసరావుపేట: అక్రమ రవాణా జరగకుండా చర్యలు: కలెక్టర్  

image

జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించారు. కలెక్టరేట్‌లో JC సూరజ్, ASP సంతోష్‌తో కలిసి గురువారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. రాబోయే వర్షా కాలంలో 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిలువ సాధ్యంపై చర్చించారు. మాన్యువల్ రీచ్‌లు పట్టా లాండ్ డీ కాస్టింగ్ ఓపెన్ రీచ్‌ల కార్యకలాపాల ద్వారా కావలసిన ఇసుక సాధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 

Similar News

News December 22, 2025

జీహెచ్‌ఎంసీ డిలిమిటేషన్‌పై హైకోర్టులో మరిన్ని పిటిషన్లు

image

జీహెచ్‌ఎంసీ డిలిమిటేషన్‌పై హైకోర్టులో మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా వార్డుల విభజన చేశారని లంచ్ మోషన్ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు విచారిస్తామని హైకోర్టు తెలిపింది. ఇప్పటికే వార్డుల మ్యాప్, జనాభా వివరాలపై సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

News December 22, 2025

Study Curse: మూడేళ్ల కోర్స్ vs మూణ్నెళ్ల కోర్స్

image

మన క్వాలిఫికేషన్ ఏదైనా అమీర్‌పేటలో 3 నెలలు కోచింగ్‌తో ఆర్నెళ్లలో IT జాబ్ పక్కా. మనం మాట్లాడుకునేది అమీర్‌పేట లేదా కోచింగ్ సెంటర్ల ఘనతపై కాదు. అలా జాబ్ ఇచ్చే కోర్సులు కాలేజ్ సబ్జెక్టులుగా ఎందుకుండవు అనే. బేసిక్స్ చెప్పే స్కూల్, ఇంటర్, ఆ తర్వాత డిగ్రీ లేదా బీటెక్ చదివితే జాబ్ వస్తుందా అంటే నో గ్యారంటీ. ట్రెండ్, మార్కెట్ అవసరాలకు తగ్గట్లు అప్డేట్ కాని చదువు మనకు అంటగట్టడం ఎందుకు? ఏమంటారు ఫ్రెండ్స్?

News December 22, 2025

ఈ నెల 24న వనపర్తిలో ‘మీ డబ్బు-మీ హక్కు’ శిబిరం

image

జిల్లా కలెక్టరేట్‌లో ఈ నెల 24న ‘మీ డబ్బు-మీ హక్కు’ ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు కలెక్టరు ఆదర్శ్‌ సురభి తెలిపారు. వివిధ కారణాలతో క్లెయిమ్‌ చేసుకోని ఆర్థిక ఆస్తుల రక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన మూడు నెలల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా జిల్లా స్థాయి శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ అన్‌క్లెయిమ్డ్ సొమ్మును తిరిగి పొందాలని ఆయన సూచించారు.