News January 31, 2025

నరసరావుపేట: ఆర్టీసీ బస్సులో రూ. 2 లక్షలు చోరీ

image

ఆర్టీసీ బస్సులో పర్స్ కత్తిరించి రెండు రూ. 2 లక్షలు అపహరించిన ఘటనపై వన్‌టౌన్ సీఐ విజయ్ చరణ్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్లకు చెందిన కె.సుజాత గుంటూరు వెళ్ళేందుకు బస్టాండ్‌కి వచ్చారు. బస్సు ఎక్కిన తర్వాత పర్సులో ఉండాల్సిన నగదు మాయమైంది. పర్స్ కింది భాగం కత్తిరించి ఉండటం గమనించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 17, 2025

Way2News కథనానికి స్పందన.. బంధువుల వద్దకు చేరిన బామ్మ

image

బాపట్లలో Way2News కథనానికి కొన్ని నిమిషాల్లోనే స్పందన లభించింది. ఓ వృద్ధురాలిని బైక్‌పై తీసుకొచ్చి నడిరోడ్డుపై విడిచిపెట్టి వెళ్లిన ఘటన మంగళవారం బాపట్లలో వెలుగు చూసింది. బైక్‌పై తీసుకొచ్చి.. బజారులో వదిలేశారు శీర్షికన Way2News కథనాన్ని ప్రచురించింది. స్పందించిన కుటుంబ సభ్యులు ఆమెను తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. దీంతో వృద్ధురాలు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

News September 17, 2025

తిరుపతి: లాసెట్-25 దరఖాస్తు గడువు పెంపు

image

న్యాయ కళాశాలల్లోని న్యాయ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును మరో రెండు రోజులు పెంచుతున్నట్లు ఏపీ లాసెట్-25 కన్వీనర్ ఆచార్య సీతాకుమారి మంగళవారం తెలిపారు. 16వరకు ఉన్న రిజిస్ట్రేషన్ గడువును 18వరకు పొడిగించినట్లు చెప్పారు. 18వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 19వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 20వ తేదీ వెబ్ ఆప్షన్ల మార్పు, 22న సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు.

News September 17, 2025

జిల్లాలో 18,944 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు: కలెక్టర్

image

ఎన్టీఆర్ జిల్లాలో 18,944 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ వెల్లడించారు. జిల్లాలో ఎరువుల నిల్వల తాజా బులెటిన్‌ను మంగళవారం రాత్రి 8 గంటలకు విడుదల చేశారు. యూరియా 3,192, డిఎపి 1,320, ఎంవోపి 1,647, ఎన్ పి కే 10,568, ఎస్ ఎస్ పీ 2,102, కంపోస్ట్ 83.6, ఎఫ్ ఓ ఎం 29.15 టన్నుల నిల్వ ఉందని స్పష్టం చేశారు. ఎరువుల విషయంలో రైతులు ఆందోళన పడొద్దని సూచించారు.