News October 3, 2025

నరసరావుపేట: ఈ నెల 6న స్వచ్ఛ అవార్డులు

image

రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛత కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను అక్టోబర్ 6న ప్రదానం చేయనున్నామని కలెక్టర్ కృతిక శుక్లా పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్వచ్ఛతా ఎన్జీఓగా దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఎంపికైంది వెల్లడించారు. జిల్లా స్థాయిలో 16 విభాగాల్లో 51 మంది అవార్డులు దక్కించుకున్నాయన్నారు. SASA పోర్టల్ (https://sasa.ap.gov.in/) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.

Similar News

News October 3, 2025

రాజధానికి భూసేకరణ.. క్యాబినెట్ కీలక నిర్ణయం

image

AP: రాజధాని అమరావతికి భూ సేకరణ విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వని భూములను భూ సేకరణ ద్వారా తీసుకునేందుకు ఆమోదం తెలిపింది. అలాగే కేంద్రం అమలు చేస్తున్న పూర్వోదయ స్కీమ్ ద్వారా రాష్ట్రానికి రూ.65,000 కోట్లు వచ్చే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పశువుల హాస్టళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

News October 3, 2025

మేక, గుర్రం గురించి ఈ విషయం మీకు తెలుసా?

image

మేకలు, గొర్రెలను వేటాడటం ఇతర జంతువులకు అంత ఈజీ కాదు. ఎందుకంటే వాటి కనుపాపలు దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. ఇవి 340 డిగ్రీల(మనిషికి 180 డిగ్రీలు) విశాల దృష్టితో చూడగలవు. UC బర్కిలీ పరిశోధకుల ప్రకారం మేకలు తలదించి మేస్తున్నప్పుడు కూడా తల తిప్పకుండా 50డిగ్రీల వరకు పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించగలవు. ఇది మేకలు, గొర్రెలు, గుర్రాలు వంటి మేసే జంతువులకు తప్పించుకోవడానికి సహజ రక్షణ వ్యవస్థగా పనిచేస్తోంది.

News October 3, 2025

మక్తల్‌లో దారుణం.. భార్యను చంపిన భర్త

image

మక్తల్ మండలం సత్యారంలో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. కర్నూల్ జిల్లాకు చెందిన కృష్ణారెడ్డి తన భార్య వినోద (33)న క్రూరంగా హత్య చేశాడు. భార్య చెయ్యి నరికి, కడుపులో పొడిచి, గోంతు కోసి భర్త పారిపోయాడు. ఈ దాడిలో వినోద అక్కడికక్కడే మృతి చెందారు. కొంత కాలంగా భార్యభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.