News April 14, 2025
నరసరావుపేట: ఎకరాకు రూ.1.60కోట్లు ఫైనల్

చీరాల ఓడరేవు బైపాస్ రోడ్డుకు సంబంధించి భూ సేకరణలో ప్రభుత్వం ఎకరాకు 1.60కోట్లు చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. హైవేకి సంబంధించి జొన్నలగడ్డ, రావిపాడు, కేసానుపల్లి, గుంట గార్లపాడు పంచాయతీల పరిధిలోని పొలాలను అధికారులు సేకరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ధర కన్నా అదనంగా చెల్లించేందుకు జిల్లా అధికారులు రైతులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో రైతు ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News February 24, 2026
విజయవాడ: మహిళతో గొడవ.. యువకుడి సూసైడ్

కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మాచవరంలో సుమంత్ స్వీట్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి ఓ మహిళతో పరిచయం ఏర్పడగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఇరువురికి ఇటీవల గొడవలు జరుగడంతో మనస్తాపం చెందిన సుమంత్ సోమవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 24, 2026
మెడిసిన్ చదవమన్నందుకు తండ్రినే చంపిన కొడుకు

లక్నోలో చదువు విషయంలో తలెత్తిన వివాదం ఘోర హత్యకు దారితీసింది. మెడిసిన్ చదవాలని తండ్రి ఒత్తిడి చేయడంతో ఆగ్రహానికి గురైన అక్షత్ ప్రతాప్ సింగ్ (21) తండ్రిని రైఫిల్‌తో కాల్చి చంపాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి చెల్లెలి ముందే వాటిని ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేశాడు. కొన్ని భాగాలను బయట పడేసి మిగిలిన వాటిని ఇంట్లోని డ్రమ్ములో దాచాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
News February 24, 2026
భూ కేటాయింపుల జోరు.. విద్యా, మౌలిక వసతులకు పెద్దపీట!

TG: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాజెక్టుల కోసం భూములను కేటాయిస్తూ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోహెడలో లాజిస్టిక్స్ పార్క్ కోసం 223 ఎకరాలు, మహబూబాబాద్, హుస్నాబాద్‌లలో ఇంజనీరింగ్ కాలేజీలకు స్థలాలను కేటాయించింది. అలాగే 10 జిల్లాల్లో 21 యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. HYD ఎలివేటెడ్ కారిడార్ కోసం కాప్రాలో 153 ఎకరాలు, ఖమ్మంలో TTD ఆలయానికి 20 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.


