News March 7, 2025
నరసరావుపేట ఎమ్మెల్యే ధర్నా

నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో హల్‌చల్ చేసిన ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కార్యాలయం నుంచి వచ్చిన లేఖపై ఎక్సైజ్ కమిషనర్ స్పందించకపోవడంతో ఎమ్మెల్యే నేరుగా అక్కడికి చేరుకొని నిరసన తెలియజేశారు. మంత్రి కొల్లు రవీంద్ర ఫోన్ చేసినా ఎమ్మెల్యే అంగీకరించలేదని సమాచారం. చివరకు దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు రావడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Similar News
News July 9, 2025
మహబూబాబాద్ జిల్లాకు 8 సబ్ స్టేషన్లు మంజూరు

జిల్లాలో వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్ సరఫరా అందించడానికి కొత్తగా 8 సబ్ స్టేషన్లు మంజూరయ్యాయని సూపరింటెండెంట్ ఇంజినీర్ విజయేందర్ రెడ్డి తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా అవసరం ఉన్న మేరకు కొత్తగా సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామన్నారు. భవిష్యత్‌లో ఎలాంటి లో వోల్టేజ్ సమస్య ఉండదని, సమర్థవంతంగా విద్యుత్ పంపిణీ మరింత మెరుగుపడుతుందని వివరించారు.
News July 9, 2025
‘కాంతార ప్రీక్వెల్’ కోసం రిషబ్‌కు రూ.100 కోట్లు?

హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార’ భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని ‘హొంబలే ఫిల్మ్స్’ ₹15 కోట్లతో రూపొందిస్తే ₹400 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ చిత్రానికి రిషబ్ ₹4కోట్లు మాత్రమే ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘కాంతార ప్రీక్వెల్’పై భారీ అంచనాలు ఉండటంతో రిషబ్ తన పారితోషికాన్ని భారీగా పెంచి ₹100 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రం అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.
News July 9, 2025
SRSPలో తగ్గిన వరద నీటి ప్రవాహం

మహారాష్ట్రలో పెద్దగా వర్షాలు కురవక పోవటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP)కి చెప్పుకోదగ్గ స్థాయిలో ఇన్ ఫ్లో రావడం లేదు. గడిచిన 24 గంటల్లో కేవలం 4291 క్యూసెక్కులు మాత్రమే వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80TMCలు) కాగా, ప్రస్తుతం 1067 అడుగులు (19.537 TMCలు) మాత్రమే నీటి నిల్వ ఉంది. బాబ్లీ గేట్లు ఎత్తినా ఇప్పటి వరకు కేవలం 8.857 TMCల నీరు మాత్రమే వచ్చి చేరింది.