News April 12, 2025
నరసరావుపేట: ఎస్పీ కంచి శ్రీనివాసరావు కీలక సూచన

పల్నాడు జిల్లాలోని పోలీస్ కార్యాలయంలో ఈనెల 14న సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 14వ తేదీన అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. ఇందులో భాగంగా సోమవారం జరిగే ప్రజా సమస్యలపరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రజలందరూ గమనించి సహకరించాలన్నారు.
Similar News
News April 13, 2025
కొయ్యూరు: భారీ వర్షానికి ఎగిరిపోయిన పాఠశాల పైకప్పు

శనివారం ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి కొయ్యూరు మండలంలోని బూదరాళ్ల పంచాయతీ గొర్రెలమెట్ట గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాల భవనం పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. పలు రేకులు పూర్తిగా ధ్వంసమై నేలకొరిగాయి. పైకప్పు రేకులు మొత్తం పోవడంతో పాఠశాల నడవని పరిస్థితి నెలకొందని పంచాయతీ సర్పంచి సాగిన ముత్యాలమ్మ, వార్డు సభ్యులు సంజీవ్ పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.
News April 13, 2025
వైష్ణవిని అభినందించిన మంత్రి బాల వీరాంజనేయ స్వామి

సింగరాయకొండ మండలం మూలగుంటపాడుకు చెందిన 7వ తరగతి విద్యార్థిని సంకటి వైష్ణవి జాతీయ స్థాయి INSTO మ్యాథమెటిక్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆమె శనివారం మంత్రి స్వామిని తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇలాంటి విజయాలతో మున్ముందు ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.
News April 13, 2025
జగిత్యాల జైత్రయాత్ర గురించి మీకు తెలుసా..?

వేలాది జనం భూస్వామ్య వ్యవస్థపై జగిత్యాలలో 1978 సెప్టెంబరు 9న రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభనే జగిత్యాల జైత్రయాత్రగా చరిత్రపుటల్లో లిఖించి ఉంది. ఈ సభకు ప్రజాయుద్ధనౌక గద్దర్ హాజరై తన ఆటపాటలతో జనాన్ని ఉర్రూతలూగించారు. రైతుకూలీ సంఘాలు పీపుల్స్ వార్‌గా, మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందడానికి జగిత్యాల జైత్రయాత్ర బీజం వేసిందని చెబుతుంటారు. తెలంగాణ విప్లవోద్యమ చరిత్రకు ఇది ఊపునిచ్చింది.