News June 3, 2024

నరసరావుపేట: ఓట్ల లెక్కింపు.. ట్రాఫిక్ మళ్లింపు

image

నరసరావుపేటలోని జేఎన్‌టీయూ కాలేజీలో ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నరసరావుపేట నుంచి వినుకొండకు రైల్వేస్టేషన్ రోడ్డు, లింగంగుంట్ల, ఇక్కర్రు, రొంపిచర్ల క్రాస్ రోడ్, సంతమాగులూరు అడ్డరోడ్డు మీదుగా వెళ్లాలి. నరసరావుపేట నుంచి ఒంగోలుకు, చిలకలూరిపేట, NH-16మీదుగా చేరుకోవాలి. నరసరావుపేటకు బయట వ్యక్తులు రాకూడదని, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ మలికా గర్గ్ తెలిపారు.

Similar News

News September 13, 2025

గుంటూరు జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్

image

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా వకుల్ జిందాల్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న సతీష్ కుమార్‌ను సత్యసాయి జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. 2016 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో బాపట్ల ఎస్పీగా పనిచేసి ప్రస్తుతం విజయనగరం జిల్లా నుంచి బదిలీపై గుంటూరుకు వస్తున్నారు. అక్కడ మాదక ద్రవ్యాల నిరోధక అవగాహన, రోడ్డు ప్రమాదాల నివారణ, విద్యార్థులు, మహిళలకు రక్షణ వంటి చర్యలు విస్తృతంగా చేపట్టారు.

News September 13, 2025

పెదనందిపాడు: పిడుగుపాటుకు ఇద్దరు మహిళల మృతి

image

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామం సమీపంలో శనివారం విషాద ఘటన జరిగింది. అన్నపర్రు నుంచి కొప్పర్రు వెళ్ళే రహదారి పక్కన చేపల చెరువు దగ్గర పొలం పనులు ముగించుకుని వస్తుండగా పిడుగుపాటు సంభవించి ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అన్నపర్రు గ్రామానికి చెందిన దేవరపల్లి సామ్రాజ్యం (రజిక), తన్నీరు నాగమ్మ (వడ్డెర)గా గుర్తించారు.

News September 13, 2025

నేడు గుంటూరు కలెక్టర్ బాధ్యతలు

image

గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమితులైన తమీమ్ అన్సారీయా శనివారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల జరిగిన IAS బదిలీల్లో ఈమె ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తూ నేడు గుంటూరుకు రానున్నారు. ఇటీవలే జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవను గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. జిల్లాకు నూతన కలెక్టర్, జేసీల కాంబినేషన్‌లో పాలన కొనసాగనుంది. 38 ఏళ్లలో జిల్లాకు మూడో మైనారిటీ వర్గానికి చెందిన కలెక్టర్.