News March 9, 2025
నరసరావుపేట: కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్‌డే

ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం ఉదయం10 గంటల నుంచి నిర్వహిస్తామని కలెక్టర్ పి. అరుణ్ బాబు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందన్నారు. జిల్లాలోని ప్రజలు సమస్యలను తెలియజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఫిర్యాదులు రాసి ఇచ్చేందుకు ప్రత్యేక సిబ్బంది ఉంటారన్నారు.
Similar News
News March 9, 2025
HYD: యాచారంలో 10 వేల కోళ్లు మృతి

కోళ్ల పెంపకంతో ఉపాధి పొందుతున్న రైతు పౌల్ట్రీ ఫామ్‌లో పెద్ద సంఖ్యలో కోళ్ల మృతితో రైతు విచారం వ్యక్తం చేశారు. నానక్‌నగర్‌లో రైతు చల్లా కృష్ణారెడ్డి పౌల్ట్రీ ఫాంలో అనుకోకుండా ఒక్కసారిగా పదివేల కోళ్లు మృతి చెందాయి. కోళ్లు చనిపోవడంతో దాదాపు రూ. 20 లక్షల నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. జరిగిన నష్టాన్ని పరిశీలించి ఎలాగైనా ప్రభుత్వం, అధికారులు తనను ఆదుకోవాలని కోరారు. గుంతలో కోళ్లను పూడ్చిపెట్టారు.
News March 9, 2025
రైలులో ప్రసవించిన మహిళ

ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఓమహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రైలులో ప్రయాణిస్తున్న మహిళకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. ఇది గమనించిన రైల్వే సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికుల సహాయంతో డెలివరీ చేశారు. అనంతరం మథుర స్టేషన్‌లో తల్లి బిడ్డలకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ Xలో పోస్ట్ చేసింది.
News March 9, 2025
IND VS NZ: హైదరాబాద్‌లో ఇదీ పరిస్థితి!

హైదరాబాద్‌లో ఛాంపియన్‌షిప్ ఫీవర్ నడుస్తోంది. భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్‌పై మరింత ఉత్కంఠ పెరిగింది. జనాలు మొత్తం టీవీలకు అతుక్కుపోయారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్ల మీద జనసంచారం తగ్గింది. సిటీలోని అన్ని ఎలక్ట్రానిక్ స్టోర్‌లలోని LED టీవీల్లో మ్యాచ్ ప్రదర్శించగా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ క్రీజులో ఉండడంతో మరింత ఆసక్తిగా నగరవాసులు వీక్షిస్తున్నారు.