News April 10, 2024
నరసరావుపేట కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా అలెగ్జాండర్

కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట ఎంపీ స్థానానికి జి.అలెగ్జాండర్‌ను పార్టీ ఖరారు చేసింది. ఆయన నరసరావుపేట అసెంబ్లీ స్థానానికి 2014, 2019లో పోటీ చేసి ఓడిపోయారు. 1993 నుంచి అలెగ్జాండర్ న్యాయవాద వృత్తిలో ఉన్నారు. న్యాయవాదుల సంఘ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ఈయన పూర్తి పేరు గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్. మండలంలోని గురవాయపాలెంలో పుట్టి, నరసరావుపేటలో స్థిరపడ్డారు.
Similar News
News December 11, 2025
GNT: సీఎం పర్యటన.. భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు పాల్గొనే ‘గ్రీవెన్స్’ కార్యక్రమం, పార్టీ శ్రేణుల సమావేశ ఏర్పాట్లను గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం స్వయంగా పరిశీలించారు. పార్టీ కార్యాలయానికి వచ్చే ప్రజలు, వీఐపీలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.
News December 11, 2025
గుంటూరుని బాల్యవివాహాల రహితంగా మార్చాలి: కలెక్టర్

బాల్యవివాహాల రహిత జిల్లాగా ఆవిష్కృతం చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఆ దిశగా అన్నీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలు అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. బాల్యవివాహాల అనర్థాలను తల్లిదండ్రులు గ్రహించాలని సూచించారు. బాల్య వివాహాలు లేని సమాజం పురోగతి సాధిస్తుందని చెప్పారు. బాల్య వివాహ ముక్త్ భారత్ (బి.వి.ఎం.బి) వంద రోజుల ప్రచార కార్యక్రమంపై కలెక్టరేట్‌లో గురువారం సమీక్షలో మాట్లాడారు.
News December 11, 2025
ఫైల్స్ పరిష్కారంలో మన జిల్లా మంత్రులకు సీఎం ర్యాంక్లు

ఏపీ సచివాలయంలో ఫైల్స్ పరిష్కారంలో మంత్రి నారా లోకేశ్ 9వ స్థానంలో నిలిచారు. ఆయన 3,669 ఫైళ్లను పరిష్కరించారు. సగటున ఒక్కో ఫైలుకు కేవలం 3 రోజుల సమయం తీసుకున్నారు. ఇతర మంత్రులు 13వ స్థానంలో అనగాని సత్యప్రసాద్: 2,269 ఫైళ్లు (4 రోజులు 21గంటలు). 22వ స్థానంలో నాదెండ్ల మనోహర్: 325 ఫైళ్లు (9 రోజుల 3గంటలు). కాగా వారి శాఖను బట్టి పరిపాలనలో వేగం, పారదర్శకత పెంచేందుకు మంత్రులు కృషి చేస్తున్నారు.


