News April 8, 2025

నరసరావుపేట: ‘క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.60 లక్షలు కొట్టేశారు’

image

క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.60 లక్షలు కొట్టేశారని తమకు న్యాయం చేయాలని బాధితులు వెంకటేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, సతీశ్, శ్రీనివాసులు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నాగేశ్వర్, రవికుమార్‌లు ఆన్లైన్ నెట్వర్క్ పేరుతో అత్యధిక లాభాలు వస్తాయని ఆశ చూపారు. పెట్టుబడి పెట్టించి, డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.

Similar News

News April 8, 2025

పాలమూరు: బుడియా బాపు ప్రత్యేకత (2/2)

image

బుడియా బాపుకు పాలమూరు బంజారాల సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానం ఉంది. సంతానం లేని దంపతులు బుడియా బాపును భక్తితో పూజిస్తే సంతానం కలుగుతుందని గట్టి నమ్మకం. వ్యవసాయం బాగా పండాలని, పశువులు ఆరోగ్యంగా ఉండాలని బుడియా బాపును ప్రార్థిస్తారు. నల్గొండ జిల్లా రంగుండ్ల గ్రామంలో బుడియా బాపు జీవ సమాధి అయ్యారని బంజారా ప్రజలు చెబుతున్నారు. తిరుమల తిరుపతి శ్రీవారితో బుడియా బాపుకు ఎంతో అనుబంధం కలిగి ఉందని చెబుతుంటారు.

News April 8, 2025

త్వరలో బంగ్లాకు తిరిగొస్తా: షేక్ హసీనా

image

భారత్‌లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో బంగ్లాకు తిరిగివస్తానని, అవామీ లీగ్ శ్రేణులు ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. SMలో వారితో మాట్లాడుతూ బంగ్లా చీఫ్ అడ్వైజర్ యూనస్‌‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ప్రజలంటే ప్రేమ లేదన్నారు. అధిక వడ్డీలకు రుణాలిచ్చి విదేశాల్లో విలాసవంతంగా బతికారన్నారు. ఆయన అధికార వాంఛ బంగ్లాను తగలబెడుతోందని దుయ్యబట్టారు.

News April 8, 2025

సలేశ్వరం జాతర ఏర్పాట్లపై సమీక్షించిన జిల్లా కలెక్టర్

image

లింగాల మండలంలో ప్రతి సంవత్సరం పౌర్ణమికి జరిగే సలేశ్వరం జాతరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ మంగళవారం ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 11, 12, 13 తేదీల్లో జాతర జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రసిద్ధ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ, రెవెన్యు అధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!