News March 30, 2025
నరసరావుపేట: జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. పవిత్ర రంజాన్ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్లో జరగనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్టు తెలిపారు. అదేవిధంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో, భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగను నిర్వహించుకోవాలని కోరారు.
Similar News
News April 1, 2025
ALERT.. రేపటి నుంచి వర్షాలు

తెలంగాణలో రేపటి నుంచి ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు, ఎల్లుండి ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురుస్తుందని పేర్కొంది. దీంతో పాటు గంటకు 40-50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
News April 1, 2025
రైతుల కళ్లలో కన్నీళ్లే మిగిలాయి: KCR

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వింతైన పాలన సాగిస్తోందని మాజీ CM KCR దుయ్యబట్టారు. మార్పు కోరుకుంటూ ఆ పార్టీని అధికారంలోకి తెచ్చిన రైతుల కళ్లలో కన్నీళ్లే మిగిలాయని విమర్శించారు. రైతులకు ఈ దుస్థితి వస్తుందని కలలోనూ తాను ఊహించలేదన్నారు. ప్రభుత్వ చర్యలతో రైతులు, వివిధ వర్గాల ప్రజలు మనోధైర్యం కోల్పోతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ధైర్యం ఇచ్చేలా వరంగల్ బహిరంగ సభ(APR 27) ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
News April 1, 2025
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: వెంకట్ రెడ్డి

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కనగల్ మండలం జి.యడవల్లి గ్రామంలోని ఎన్.వి.కె ఫంక్షన్ హాల్ హాల్‌లో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఐ.కె.పి సెంటర్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు.