News April 14, 2024
నరసరావుపేట: డివైడర్‌ను ఢీకొని ఇసుక లారీ బోల్తా

నరసరావుపేట పట్టణంలోని ఉప్పలపాడు బైపాస్ రోడ్డు వద్ద ఇసుక లారీ ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఆదివారం నరసరావుపేట నుంచి ఉప్పలపాడు వెళుతున్న ఇసుక లారీ డివైడర్ ఢీకొని బోల్తా పడినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఆ సమయంలో అటుగా ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. డ్రైవర్‌తోపాటు క్లీనర్ క్షేమంగా బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
Similar News
News September 10, 2025
రేపు అండర్-14, 17 బాలబాలికల క్రీడా పోటీలు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14, 17 బాలబాలికల క్రీడా పోటీలు నిర్వహిస్తామని కార్యదర్శి గోపి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు స్థానిక బీఆర్ స్టేడియంలో కురుష్, పెదకాకాని జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఆర్చరీ, పల్నాడు జిల్లా నందిగామ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో చెపక్ తక్ర విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. పాల్గొనదలచిన క్రీడాకారులు సంబంధిత స్కూల్ నుంచి బోనఫైడ్ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు
News September 10, 2025
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో స్టాపులు పునరుద్ధరణ

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని దొనకొండ, పిడుగురాళ్ల, కురిచేడు రైల్వే స్టేషన్లలో గతంలో రద్దు చేసిన రైళ్ల నిలుపుదలలను మళ్లీ పునరుద్ధరించినట్లు గుంటూరు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. ఈ మార్పులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయని, ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త సమయపట్టిక ప్రకారం అన్ని రైళ్లు ఆగనున్నాయని అధికారులు వెల్లడించారు.
News September 10, 2025
నేడు ఉండ్రాళ్ళ తద్ది.. విశిష్టత తెలుసా

ఉండ్రాళ్ళ తద్ది నోమును భాద్రపద బహుళ తదియ రోజున స్త్రీలు ఆచరిస్తారు. దీని విశిష్టత ఏమంటే, ఈ నోమును పాటిస్తే పెళ్లికాని అమ్మాయిలకు మంచి భర్త లభిస్తాడని, వివాహితులు సుమంగళిగా ఉంటారని నమ్మకం. ఈ నోములో ఉండ్రాళ్ళను నైవేద్యంగా పెడతారు, కాబట్టి దీనికి ఉండ్రాళ్ల తద్ది అనే పేరు వచ్చింది. ఐదు సంవత్సరాలు ఈ నోమును ఆచరించి, ఉద్యాపన చేసేటప్పుడు వాయనంతో పాటు చీర, రవికలను కూడా సమర్పిస్తారు.