News February 1, 2025
నరసరావుపేట: దూరవిద్య ఇంటర్ పరీక్షలు మార్చి 3న ప్రారంభం

దూరవిద్య ఇంటర్ పరీక్షలు మార్చి నుంచి ప్రారంభమవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. చంద్రకళ శనివారం తెలిపారు. సైన్సు,ఆర్ట్స్ గ్రూపుల్లో అడ్మిషన్లు పొంది 2,387 మంది జిల్లాలో పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, వినకొండ పట్టణాల్లో మొత్తం 9 పరీక్ష కేంద్రాలను అన్ని మౌలిక వసతులతో సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఈ నెల 3 నుంచి 15 వరకు పరీక్షలు ఉంటాయన్నారు.
Similar News
News July 6, 2025
MNJ కేన్సర్ ఆస్పత్రికి 45 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు

MNJ కేన్సర్ ఆస్పత్రిలో ఇక మెరుగైన వైద్య సేవలందనున్నాయి. ఆస్పత్రికి 45 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయిస్తూ మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. రోజురోజుకూ కేన్సర్ బాధితులు పెరిగిపోతుండటంతో లక్డీకపూల్(రెడ్ హిల్స్)లో ఉన్న MNJలో పేషెంట్లు చికిత్సకు ఇబ్బందులు ఏర్పడకుండా బోర్డు వీరిని నియమించింది.
News July 6, 2025
మహిళల రక్షణ కోసం ‘SWAT’ బృందం

HYD నగర పోలీసులు మహిళల భద్రత, నిరసన ప్రదర్శనల నిర్వహణ కోసం 35 మంది మహిళా పోలీసులతో “స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్(SWAT)”ను ప్రారంభించారు. కరాటే, నిరాయుధ పోరాటంలో ప్రత్యేక శిక్షణ పొందిన ఈ బృందం ధర్నాలు, ర్యాలీలు, ముఖ్యమైన ఈవెంట్లు, పండుగల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేస్తుంది. సరికొత్త యూనిఫాంలో సచివాలయం వద్ద విధుల్లో చేరిన ఈ బృందం.. మహిళల ఆందోళనలు నియంత్రించడంలో కీలకపాత్ర పోషించనుంది.
News July 6, 2025
విజయవాడ: భక్తులతో కిటకిటలాడిన కనకదుర్గమ్మ ఆలయం

ఆషాడ మాసపు చివరి ఆదివారం, తొలి ఏకాదశి కావడంతో కనకదుర్గమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వందలాది సారె బృందాలు అమ్మవారిని దర్శించుకున్నాయి. మహా మండపం ఆరవ అంతస్తులో శాకాంబరీ ఉత్సవాలకు భక్తులు సమర్పించిన కాయగూరలు, పండ్లను ఈవో శీనా నాయక్ పరిశీలించారు. సారె బృందాల కోసం లిఫ్ట్, దర్శన మార్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.