News February 23, 2026
నరసరావుపేట: నేడు కలెక్టరేట్లో PGRS

జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ జరుగుతుందని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌కు రావడంతో పాటు, ఇంటి నుంచే మీకోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. 1100 నంబర్‌కు ఫోన్ చేసి లేదా Meekosam.ap.gov.in ద్వారా తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News February 24, 2026
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి: అదనపు కలెక్టర్

సాధ్యమైనంతవరకు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో సూచించారు. మహబూబాబాద్ జిల్లాలో సిజేరియన్ ప్రసవాల శాతాన్ని తగ్గించే దిశగా, పీసీపీయన్ డీటీ చట్టం అమలుపై కీలక సమీక్ష సమావేశం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించారు. అవసరమైన సందర్భాల్లో మాత్రమే సిజేరియన్ శస్త్రచికిత్సలు నిర్వహించాలని గర్భిణీల ఆరోగ్యం, శిశువుల భద్రతను ప్రధానంగా పరిగణనలోకి తీకోవాలన్నారు.
News February 24, 2026
మంచిర్యాల: వార్షిక పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి

10వ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వార్షిక పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించాలని, పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
News February 24, 2026
JGTL: ఇది పరీక్ష కాలం.. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు

జగిత్యాల జిల్లాలో ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ఇంటర్ విద్యార్థులు 15,125 మంది ఉన్నారు. ఇందులో 1st ఇయర్లో 7,699 ఉండగా, 2nd ఇయర్లో 7426 ఉన్నారు. వీరి కోసం జిల్లాలో 30 పరీక్షా కేంద్రాలను, 12 స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసామని, విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందు సెంటర్ కు చేరుకోవాలని కోరారు.


