News November 24, 2025
నరసరావుపేట: నేతన్నలకు అమలు కానీ ఉచిత విద్యుత్.!

చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రతినెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తామని సీఎం చంద్రబాబు ఆగస్టు 7న హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి మూడు నెలలు గడిచినా పథకం అమలు కాలేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో కేవలం 280 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. చిలకలూరిపేట, సత్తెనపల్లి గ్రామాలలో పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు ఈ ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
Similar News
News November 24, 2025
చందూర్: పదో తరగతి విద్యార్థి సూసైడ్

నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మైనార్టీ గురుకుల పాఠశాలలో పదోతరగతి విద్యార్థి గతరాత్రి గదిలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ప్రిన్సిపల్..పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఎస్సై సాయన్న తెలిపారు.
News November 24, 2025
HYD: ప్రాణాలు పోతున్నాయి.. జాగ్రత్త!

వేగం మానుకో అని పోలీసులు ఎంత చెబుతున్నా కొందరు రైడర్లు ఆ మాటను పెడచెవిన పెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ర్యాష్ డ్రైవింగ్‌తో ఇటీవల HYDలో పదుల సంఖ్యలో చనిపోయారు. సెల్ఫ్ డ్రైవింగ్‌లో చేసిన తప్పిదాలు, డివైడర్లు, <<18366739>>మెట్రో పిల్లర్ల గోడలను<<>> ఢీ కొట్టిన ఘటనలూ ఉన్నాయి. అల్వాల్‌లో ఇవాళ ఉ. ఓ కారు దుకాణాల మీదకు దూసుకురాగా.. సదరు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. సో.. హైదరాబాదీ ఇకనైనా స్వీడ్ తగ్గించు.
News November 24, 2025
ఎన్నికలపై విచారణ వాయిదా

TG: పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో ఇవాళ జరగాల్సిన విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది. కాగా కోర్టు ఆదేశాల మేరకు 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని న్యాయస్థానానికి ప్రభుత్వం తెలియజేయనుంది.


