News November 16, 2025
నరసరావుపేట: పర్యాటక కేంద్రాల అభివృద్ధిపై సమీక్ష

అమరావతిలోని బుద్ధ విగ్రహాన్ని ఆధునికరించినట్లు కలెక్టర్ కృత్తిక శుక్లా తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం జిల్లాలోని పర్యాటక కేంద్రాల అభివృద్ధిపై ఆమె సమీక్షించారు. పర్యాటక ప్రాజెక్టు స్థితిగతులు, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. కోటప్పకొండ అభివృద్ధిపై డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. కొండవీడు వద్ద పర్యాటక భవనం నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించాలని చెప్పారు.
Similar News
News November 16, 2025
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎంపీ అరుణకు విశేష స్వాగతం

సౌతాఫ్రికా అధికారిక పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న పాలమూరు ఎంపీ డీకే.అరుణను ఉమ్మడి మహబూబ్‌నగర్ నాయకులు ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా అందరి ఆదరణకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే భారత రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు–2025 JPC సభ్యురాలిగా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.
News November 16, 2025
టెస్టుకు దూరమైన గిల్

టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దీంతో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆయన పాల్గొనరని BCCI వెల్లడించింది. రెండో రోజు బ్యాటింగ్ చేస్తూ గిల్ మెడనొప్పితో మైదానాన్ని వీడారు. అటు ఇవాళ మూడో రోజు ఆట ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్సులో సౌతాఫ్రికా స్కోర్ 93/7గా ఉంది.
News November 16, 2025
ఫోన్ కోసం అలిగి.. బాలుడు అదృశ్యం: ఎస్ఐ

సెల్ ఫోన్ చూడవద్దని తల్లి మందలించడంతో ఓ బాలుడు (11) అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన నరసాపురంలో చోటుచేసుకుంది. ఈ నెల 14న బాలుడు ఫోన్ పగులగొట్టి వెళ్లిపోయాడని, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై జయలక్ష్మి తెలిపారు. బాలుడి ఆచూకీ కోసం పట్టణం, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.


