News December 19, 2025

నరసరావుపేట: బైక్‌ దొంగ అరెస్ట్.. 8 వాహనాలు స్వాధీనం

image

ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న షేక్ ఇస్మాయిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. CI ప్రభాకర్ తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు మిర్చి యార్డులో కూలీగా పనిచేసే ఇస్మాయిల్, వ్యసనాలకు బానిసై దొంగతనాలు మొదలుపెట్టాడు. నిందితుడి నుంచి నరసరావుపేట, చిలకలూరిపేట, నగరంపాలెం, మేదరమెట్ల ప్రాంతాల్లో చోరీ చేసిన 8వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు CI పేర్కొన్నారు.

Similar News

News January 1, 2026

కర్నూలు, నంద్యాల జిల్లాల న్యూస్ రౌండప్

image

★ నేటి నుంచి రేషన్ పంపిణీ
☞ సంక్రాంతి కానుకగా రూ.20కే కిలో గోధుమ పిండి
★ ఆదోని మండలం-2 పాలన మొదలు
★ రేపటి నుంచి కందుల కొనుగోళ్లు షురూ
★ ఎమ్మిగనూరులో 25 తులాల బంగారం చోరీ
★ జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా సాగిన న్యూ ఇయర్ సంబరాలు
★ నంద్యాల: జనవరి 17 నుంచి స్వచ్ఛరథం
★ కర్నూలు: గృహ లబ్ధిదారులకు సమస్యలా.. నేడు ఫోన్ ఇన్
☞ 08518257481
★ కొండారెడ్డి బురుజు వద్ద కేక్ కట్ చేసిన ఎస్పీ

News January 1, 2026

‘శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి వేతనదారులకు రూ.322 కోట్లు చెల్లించాం’

image

జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి వేతనదారులకు ఇప్పటివరకు ఆర్థిక సంవత్సరంలో రూ.322 కోట్ల చెల్లించడం జరిగిందని డ్వామా పీడీ లవరాజు తెలిపారు. బుధవారం సాయంత్రం జలుమూరులోని స్థానిక కార్యాలయంలో క్షేత్ర సహాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వేతనదారులకు మరో రూ.14 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు కోటి 36 లక్షల పది దినాలు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు.

News January 1, 2026

అల్లూరి: తొలిరోజు 91.6 శాతం పంపిణీ

image

అల్లూరి ఉమ్మడి జిల్లాలో బుధవారం 91.6శాతం మంది లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ పీడీ వీ.మురళి తెలిపారు. 22 మండలాల పరిధిలో మొత్తం 1,21,907 మంది లబ్ధిదారులకు రూ.51,37,79,000 విడుదలైందన్నారు. బుధవారం రాత్రి 8 గంటల సమయానికి 1,11,669 మందికి రూ.46,96,79,000 పింఛన్ సొమ్మును పంపిణీ చేశారన్నారు.