News February 24, 2025
నరసరావుపేట: మద్యం షాపులు, బార్లు మూసివేత

పల్నాడు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 3 రోజుల పాటు మద్యం షాపులు మూసివేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి మణికంఠ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సమయాల్లో గందరగోళ పరిస్థితులు రాకుండా ఉండేందుకు తాత్కాలికంగా మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు చెప్పారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News February 24, 2025
ఎనుమాముల మార్కెట్‌కు తరలొచ్చిన మిర్చి

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు పెద్ద ఎత్తున మిర్చి బస్తాలు వచ్చాయి. సుమారు 90 వేల బస్తాలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరంలో అత్యధిక బస్తాలు ఈరోజే వచ్చాయన్నారు. మిర్చి యార్డ్ మొత్తం ఎర్ర బంగారంతో నిండిపోయింది. సాధ్యమైనంత తక్కువ సమయంలో కాంటాలు పెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులకు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశారు.
News February 24, 2025
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా…

కరీంనగర్ జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. గడచిన 24 గంటల్లో అత్యధికంగా బురుగుపల్లి 38.5°C నమోదు కాగా, జమ్మికుంట 37.8, మల్యాల, ఈదులగట్టేపల్లి 37.7, నుస్తులాపూర్ 36.8, గంగిపల్లి, పోచంపల్లి 36.3, కొత్తపల్లి-ధర్మారం 35.6, వీణవంక 35.4, గట్టుదుద్దెనపల్లె 35.3, గంగాధర 35.1, ఇందుర్తి 35.0, కరీంనగర్ 34.9, తాడికల్ 34.7, వెదురుగట్టు 34.6, గుండి 34.4°C గా నమోదైంది.
News February 24, 2025
చొప్పదండి: కారు ఢీకొని యువకుడి మృతి

చొప్పదండి పట్టణంలోని ఉడిపి హోటల్ సమీపంలో ఆదివారం రాత్రి కారు ఢీకొని ఒడ్నాల రమేష్ ( 22) అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ గొల్లపల్లి అనూష తెలిపారు. చొప్పదండి మండలం రాగంపేట గ్రామానికి చెందిన రమేష్ అవివాహితుడు. పట్టణంలోని హోటల్లలో పని చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. మృతుని తండ్రి గతంలోనే మరణించగా తల్లి కరీంనగర్లో కూలీ పని చేస్తూ జీవిస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.