News April 4, 2025
నరసరావుపేట: మూల్యాంకన ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్

కలెక్టర్ అరుణ్ బాబు స్థానిక శ్రీమతి కాసు రాఘవమ్మ బ్రహ్మానంద రెడ్డి కళాశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకన ప్రక్రియను శుక్రవారం పరిశీలించారు. పరీక్ష పత్రాలను భద్రపరిచిన గదిని పరిశీలించి ఎంత శాతం మూల్యాంకన జరిగిందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫస్ట్ ఎయిడ్ ఏర్పాట్లను పరిశీలించి మూల్యాంకన సిబ్బందికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మూల్యాంకన ప్రక్రియను సకాలంలో పూర్తిచేయాలన్నారు.
Similar News
News April 11, 2025
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. రేపు శనివారం, ఆదివారం వారాంతపు సెలవు, సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా సెలవును ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. జిల్లా రైతులు గమనించి మార్కెట్ సిబ్బందికి సహకరించాలని కోరారు. మార్కెట్ తిరిగి మంగళవారం ప్రారంభం అవుతుందని చెప్పారు.
News April 11, 2025
KNR: మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహానికి నివాళులర్పించిన కలెక్టర్

మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, బిసి విద్యార్థి సంఘ నాయకులు, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
News April 11, 2025
రేపు కరీంనగర్‌కు రానున్న కేటీఆర్

కరీంనగర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారని గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్‌లోని చింతకుంట బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ సభ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు కమలాకర్ తెలిపారు. బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పార్టీ కార్యాలయంలోనే కొనసాగుతాయని చెప్పారు.