News July 4, 2025

నరసరావుపేట: మొహరం సందర్భంగా పటిష్ట బందోబస్తు

image

మొహరం వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. మొహరం వేడుకలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని అన్ని గ్రామాల్లో ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. చట్ట విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరూ సోదర భావంతో మెలగాలని, ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరిగే విధంగా ప్రజలందరూ సహకరించాలని కోరారు.

Similar News

News July 4, 2025

కూటమిపై ప్రజలకు నమ్మకం పోయింది: అమర్నాథ్

image

కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల ప్రజలకు ఆ ప్రభుత్వంపై నమ్మకం పోయిందని అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. సబ్బవరంలో మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి శుక్రవారం సమావేశం జరిగింది. సమావేశంలో గుడివాడ మాట్లాడుతూ.. బాబు షూరిటీ-మోసం గ్యారంటీ టైటిల్ బాబుకి సరిగ్గా సరిపోతుందన్నారు. అర్హులకు పెన్షన్లు అందడం లేదన్నారు.

News July 4, 2025

శ్రీకాకుళం జిల్లా టుడే టాప్ న్యూస్ ఇవే

image

* నరసన్నపేట: టైర్ పేలి విద్యార్థుల ఆటో బోల్తా
* జిల్లాలో అల్లూరి జయంతి
* శ్రీకాకుళం, ఎల్.ఎన్ పేట, పొందూరు, రణస్థలంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు
* ఆమదాలవలస: రైలు ఢీకొని వ్యక్తి మృతి
* హిరమండలం: నిండు కుండల వంశధార నది
* అక్రమ సంబంధం రెండు హత్యలకు దారితీసింది: డీఎస్పీ
* టెక్కలి: విద్యుత్ మీటర్ల సమస్యతో తల్లికి వందనం ఇబ్బందులు
* సారవకోట: అంగన్వాడీ కార్యకర్తల ధర్నా నోటీసు

News July 4, 2025

వనపర్తి: పోలీస్ డ్యూటీమీట్‌లో పతకాలు సాధించిన వారికి అభినందన

image

జోగులాంబ జోనల్ పరిధిలో జరిగిన పోలీస్ డ్యూటీమీట్‌లో వనపర్తి జిల్లాకు బంగారు 4, రజత 4, కాంస్య 5 మొత్తం 13 పతకాలు సాధించారు. వీరిని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ గిరిధర్ అభినందించారు. నాగర్ కర్నూల్‌లో 2 రోజులపాటు నిర్వహించిన జోగులాంబ జోన్-7 జోనల్ పోలీస్ డ్యూటీ మీట్‌లో ఈ పతకాలు సాధించినట్లు తెలిపారు. వచ్చే నెలలో రాష్ట్రస్థాయిలో జరిగే పోలీస్ డ్యూటీ మీట్‌లో పాల్గొని మరిన్ని పతకాలు సాధించాలన్నారు.