News March 20, 2025
నరసరావుపేట యువకుడికి గేట్‌లో 6వ ర్యాంకు

గేట్ పరీక్ష ఫలితాల్లో నరసరావుపేటకు చెందిన జస్వంత్ భవాని అఖిల భారత స్థాయిలో 6వ ర్యాంక్ సాధించాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించిన 2025 గేట్ పరీక్ష ఫలితాలను బుధవారం అధికారికంగా విడుదల చేశారు. ఈ పరీక్షా ఫలితాల్లో పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన జస్వంత్ భవాని అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు బంధువులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News March 20, 2025
IPL ట్రోఫీ కోసం PBKS ప్రత్యేక పూజలు!

మరో రెండ్రోజుల్లో IPL మొదలు కానుండటంతో అన్ని జట్లు సమరానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. అయితే పంజాబ్ కింగ్స్ జట్టు ఈసారి కప్ తమకే రావాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించింది. టీమ్ కోచ్ రికీ పాంటింగ్, కోచింగ్ సిబ్బంది, ప్లేయర్లంతా కలిసి పూజలో పాల్గొన్నారు. 2008 నుంచి ఆడుతున్నప్పటికీ పంజాబ్ ఒక్కసారి కూడా ట్రోఫీ అందుకోలేదు. మరి పూజతోనైనా జట్టు తలరాత మారుతుందో చూడాలి.
News March 20, 2025
రేవంత్‌కు పర్సెంటేజీలపైనే ఇంట్రెస్ట్: కేటీఆర్

TG: రేవంత్ రెడ్డి జాక్ పాట్ సీఎం అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. ‘ఆయనకు అదృష్టం బాగుంది.. పర్సనాలిటీ పెంచుకుంటారనుకున్నా. అయితే పర్సెంటేజీలపైనే రేవంత్‌కు ఆసక్తి ఉంది. ఢిల్లీకి మూటలు పంపి పదవి కాపాడుకోవడంపై దృష్టి పెట్టారు’ అని విమర్శించారు. సూర్యాపేట సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఫీనిక్స్ పక్షిలా పోరాటం చేస్తున్నారని KTR ప్రశంసించారు.
News March 20, 2025
2026 మార్చి 31నాటికి ‘నక్సల్స్‌రహిత భారత్’: అమిత్ షా

వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా భారత్ మావోయిస్టురహిత దేశంగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ‘ఈరోజు ఛత్తీస్‌గఢ్‌లో 22మంది నక్సల్స్‌ని మన సైనికులు అంతం చేశారు. ఈ క్రమంలో ‘నక్సల్ రహిత భారత్’ దిశగా మరో విజయాన్ని సాధించారు. ప్రభుత్వం ఎన్ని అవకాశాలిచ్చినా లొంగిపోని నక్సలైట్లపై జాలి చూపే ప్రసక్తే లేదు. మా ప్రభుత్వం వారిపై అత్యంత కఠిన వైఖరిని అవలంబిస్తోంది’ అని పేర్కొన్నారు.