News November 21, 2025

నరసరావుపేట: రేపు ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక పీజీఆర్ఎస్

image

ఎస్టీ, ఎస్సీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నామని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. శనివారం ఉదయం 10.30 గంటలకు నరసరావుపేట కలెక్టరేట్‌లో ఫిర్యాదుల పరిష్కార వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు వినియోగించుకుని తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించుకోవాలని కోరారు.

Similar News

News November 21, 2025

ఖమ్మం: ఇందిరమ్మ చీరల పంపిణీకి మంత్రి తుమ్మల ఆదేశం

image

ఖమ్మం జిల్లాలో 18ఏళ్లు నిండిన ప్రతి గ్రామీణ మహిళకు ఇందిరమ్మ చీరలను ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌లోపు పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనులు నాణ్యతతో జరిగేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకుంటే రూ.10 లక్షల గ్రాంట్ ఇస్తామని మంత్రి ప్రకటించారు.

బ్రెయిన్ స్ట్రోక్‌కి ముందు కనిపించే లక్షణాలు ఇవే

image

మెదడుకు ఆక్సిజన్, రక్తం సరఫరాలో తేడాతో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ సడెన్‌గా వచ్చినప్పటికీ నెలల ముందు నుంచే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అసాధారణ తలనొప్పి, ముఖం, కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, చూపులో తేడా, తలతిరగడం వంటివి బ్రెయిన్ స్ట్రోక్‌ రావడానికి ముందు కనిపించే లక్షణాలని వైద్యులు చెబుతున్నారు. ఒక్కసారిగా నీరసంగా అనిపించడం, అంతే వేగంగా తగ్గినట్టు అనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలి.