News March 16, 2025

నరసరావుపేట: రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య

image

నరసరావుపేట టిడ్కో గృహాల సమీపంలోని రైలు పట్టాల వద్ద డోన్ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ఐ శ్రీనివాసరావు నాయక్ తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ.. మృతురాలు నీలం రంగు డిజైన్ చీర, నీలం రంగు జాకెట్టు ధరించినట్లు చెప్పారు. మృతురాలిని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. వివరాలు తెలిసిన వారు స్థానిక రైల్వే పోలీసులను 9440438256 సంప్రదించాలన్నారు.

Similar News

News January 11, 2026

ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండటానికి కారణం ఏమిటి?

image

ఆవు పాలు పసుపు రంగులో ఉండటానికి కారణం బీటా-కెరోటిన్ అనే సహజ వర్ణద్రవ్యం. ఇది ఆవులు గడ్డి, ఆకుకూరలు తిన్నప్పుడు ఈ బీటా-కెరోటిన్ పాల కొవ్వులో కలిసిపోయి, పాలకి లేత పసుపు రంగునిస్తుంది. ఇది ‘విటమిన్-ఎ’గా మారుతుంది. గేదె పాలలో బీటా-కెరోటిన్ లేకపోవడం వల్ల తెల్లగా ఉంటాయి. కోవా, పెరుగు, పన్నీర్, పాయసం, కుల్ఫీ, నెయ్యి తయారీకి గేదె పాలే మంచివి. ఒకవేళ స్వీట్లు తయారు చేసుకోవాలంటే ఆవు పాలను ఎంచుకుంటే మంచిదట.

News January 11, 2026

వికారాబాద్: పేదబిడ్డకు రూ.లక్ష పెళ్లికానుక

image

కోటపల్లి మండలం కరీంపూర్ గ్రామంలో ఎవరి పెళ్లి జరిగినా రూ.1,05,116 ఇస్తానని మాజీ సర్పంచ్ అనిల్ సుందరి ఎన్నికల వేళ మాటిచ్చారు. హామీ మేరకు ఆదివారం రాత్రి ఆ కుటుంబానికి అందచేశారు. కరీంపూర్ గ్రామానికి చెందిన లాల్‌బీ వాహేద్ కూతురు పెళ్లి కానుకతో ఆ కుటుంబానికి వెలుగునిచ్చారు. ఈ కార్యక్రమంలో కరీంపూర్ సర్పంచ్ షబానబి సదత్ పటేల్, ఉప సర్పంచ్ యేసయ్య ఉన్నారు.

News January 11, 2026

NLG: లక్ష్యానికి దూరంగా.. మీనం..!

image

నల్గొండ జిల్లాలో చేప పిల్లల పంపిణీ ప్రక్రియపై మత్స్యకారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం ముగిసినా నిర్దేశిత లక్ష్యంలో 80 శాతం పూర్తికాకపోవడం గమనార్హం. జూలైలోనే జలాశయాలు నిండినా, నిధుల విడుదల ఆలస్యమవడంతో పంపిణీలో జాప్యం జరిగింది. ప్రభుత్వం స్పందించి మిగిలిన కోటాను పూర్తి చేయడంతో పాటు, నాణ్యమైన చేప పిల్లలను అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.