News April 9, 2025

నరసరావుపేట: వాల్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

పల్నాడు జిల్లాలో ఈనెల 8 నుంచి 22వ తేదీ వరకు 15 రోజుల పాటు 7వ పౌష్టికాహార పక్షోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ అరుణ్ బాబు గోడ పత్రికలు ఆవిష్కరించారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమం జరిగింది. డీఈఓ చంద్రకళ, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News April 18, 2025

భూ సమస్యలు లేని రాష్ట్రంగా మార్చేందుకే భూభారతి: ఎమ్మెల్యే కడియం

image

తెలంగాణను భూ సమస్యలు లేని రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతోనే భూ భారతి- 2025 చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చినట్లు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. చిల్పూర్ మండల కేంద్రంలోని వరలక్ష్మి గార్డెన్స్‌లో భూ భారతి ఆర్ఆర్- 2025 చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌ పాల్గొన్నారు.

News April 18, 2025

MNCL: ఛత్తీస్‌గఢ్ వెళ్లి దొంగను అరెస్ట్ చేశారు

image

కోర్టుకు గైర్హాజర్ అవుతున్న వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. టూ టౌన్ ఎస్సై మహేందర్ కేసు వివరాలు వెల్లడించారు. దొంగతనం కేసులో కోర్టుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్న హరదీప్ సింగ్‌ను ఛత్తీస్‌గఢ్‌లో పట్టుకొని బెల్లంపల్లి తీసుకొచ్చారు. జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా జైలు శిక్ష విధించారు. అనంతరం ఆసిఫాబాద్ జైలుకు తరలించారు.

News April 18, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

error: Content is protected !!