News April 21, 2025

నరసరావుపేట: విద్యార్థిగా మారిన జిల్లా కలెక్టర్

image

పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు విద్యార్థిగా మారారు. స్థానిక మున్సిపల్ బాయ్స్ హైస్కూల్‌లో తరగతుల ట్రాన్సిషన్ ప్రోగ్రాంను ప్రారంభించారు. చిన్నారులతో కలిసి ముచ్చటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి తరగతి గదిలో కూర్చున్నారు. వారితో కలిసి పాఠాలు విన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 21, 2025

తర్వాతి పోప్ అయ్యే ఛాన్స్ వీరికే!

image

పోప్ ఫ్రాన్సిస్ గతించడంతో ఆయన స్థానంలో తర్వాతి పోప్ ఎవరా అన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఐదుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారు..
* లూయిస్ టగ్లే(ఫిలిప్పీన్స్)
* పియెట్రో పారోలిన్(ఇటలీ)
* జీన్-మార్క్ అవెలీన్(ఫ్రాన్స్)
* విలెమ్ ఐజ్క్(నెదర్లాండ్స్)
* మాల్కమ్ రంజిత్(శ్రీలంక)

News April 21, 2025

సిద్దిపేట: ప్రజావాణికి 44 దరఖాస్తులు

image

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం ఫిర్యాదుదారుల నుంచి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మొత్తం 44 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

News April 21, 2025

BREAKING: గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల

image

AP: గ్రూప్‌-1 మెయిన్స్ రాత పరీక్షకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. మే 3 నుంచి 9 వరకు 4 జిల్లా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. అన్ని పేపర్లకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఈరోజు నుంచే హాల్ టికెట్లను https://psc.ap.gov.in వెబ్‌సైట్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

error: Content is protected !!