News March 17, 2025
నరసరావుపేట: విద్యార్థుల కోసం అదనపు ఆర్టీసీ సర్వీసులు

పదవ తరగతి విద్యార్థుల కోసం అదనంగా పల్నాడు జిల్లాలో 70 ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు ప్రజా రవాణా అధికారి మధు తెలిపారు. చిలకలూరిపేట-13, సత్తెనపల్లి- 11,మాచర్ల- 4, పిడుగురాళ్ల -15 అదనంగా నడుపుతున్నామన్నారు. పరీక్షా సమయానికి అనుకూలంగా బస్ సర్వీసులు ఉంటాయన్నారు. పూర్తిగా ఉచిత ప్రయాణానికి విద్యార్థులు తమ హాల్ టికెట్లను కండక్టర్‌కు చూపిస్తే సరిపోతుందని ఆర్టీసీ జిల్లా అధికారి మధు పేర్కొన్నారు.
Similar News
News November 6, 2025
ఏ దిక్కున కూర్చొని భోజనం చేయాలి ?

ఆయుష్షు కోరుకునేవారు తూర్పు ముఖంగా, కీర్తి, పేరు ప్రఖ్యాతలు కోరుకునేవారు దక్షిణ ముఖంగా కూర్చుని భోజనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. తూర్పు దిశ నుంచి ప్రాణ, సానుకూల శక్తి వస్తుంది. ఈ శక్తి భోజనం చేసేటప్పుడు శరీరంలోకి ప్రవహించి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆహారం ఆయురారోగ్యాలను ఇవ్వడానికి, ఉత్తమ ఫలితాలను పొందడానికి ఈ నియమాలు పాటించాలి. భోజనం చేసేటప్పుడు పద్మాసనంలో కూర్చోవడం, మౌనం పాటించడం మంచిది.
News November 6, 2025
5,346 టీచర్ పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఢిల్లీలో 5,346 <
News November 6, 2025
కానిస్టేబుల్ ట్రైనింగ్ ఇంకెప్పుడు?

AP: కానిస్టేబుల్ ఫలితాలు విడుదలై 3 నెలలు పూర్తవుతున్నా ట్రైనింగ్ ప్రారంభం కాకపోవడంపై అభ్యర్థులు నిరాశ చెందుతున్నారు. వెంటనే శిక్షణ ప్రారంభించాలని కోరుతున్నారు. 6,100 కానిస్టేబుల్ పోస్టులకు 2022 NOVలో నోటిఫికేషన్ వచ్చింది. ప్రిలిమ్స్ పూర్తయినా లీగల్ చిక్కులతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. గతేడాది జూన్‌లో మెయిన్స్ నిర్వహించి ఆగస్టులో ఫలితాలు ప్రకటించారు. ఉద్యోగాలకు ఎంపిక చేసినా ట్రైనింగ్ ప్రారంభం కాలేదు.


