News April 16, 2025
నరసరావుపేట: సినిమాలో ఎమ్మెల్యే చదలవాడ

ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని దర్శకులు దిలీప్ రాజా తెలిపారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ను ప్రకటించారు. సినిమా పూర్తిస్థాయి కమర్షియల్‌గా ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉండాలో ఈ సినిమాలో చూపిస్తామన్నారు. దర్శకులు నరేశ్ దోనే, మణివరణ్ ఉన్నారు.
Similar News
News September 18, 2025
కలెక్టర్‌ను కలిసిన రాజమహేంద్రవరం జైల్ సూపరింటెండెంట్

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన కీర్తి చేకూరిను గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయ ఛాంబర్‌లో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాహుల్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జైళ్లలో పరిస్థితిని ఆమెకు వివరించారు. అందరి సహకారంతో జిల్లాను అభివృద్ది పథంలో నడపాలని కలెక్టర్ అన్నారు.
News September 18, 2025
పోషకాహారంతో ఆరోగ్యమే మహాభాగ్యం: KMR కలెక్టర్

సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని KMR కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. లింగంపేట మండలం పోతాయిపల్లిలో జరిగిన ‘స్వచ్ఛతా హీ సేవ-2025’, ‘పోషక్ అభియాన్’ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. ‘పోషక్ అభియాన్’ ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో పోషక మాసం నిర్వహిస్తూ పౌష్టికాహారం విలువను తెలియజేస్తున్నామన్నారు.
News September 18, 2025
ప్రతి విద్యార్థి లక్ష్యం కోసం పట్టుదలతో చదవాలి: కలెక్టర్

ప్రతి విద్యార్థి తాము ఎంచుకున్న లక్ష్యం కోసం పట్టుదలతో చదివి సాధించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. గురువారం పరకాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్‌లో తరగతి గదులు, కిచెన్, డార్మేట్రి, పరిసరాలను పరిశీలించారు. పలు రికార్డులను తనిఖీ చేశారు.